Balakrishna to take two-month break from films for Elections: అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేసిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ 109వ సినిమాగా సంభోదిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచారాలు తెరమీదకు వస్తూ ఉండగా షూటింగ్ మాత్రం శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు సినిమా యూనిట్. ఇక తాజాగా బాలకృష్ణకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే నందమూరి బాలకృష్ణ రెండు నెలల పాటు నటనకు బ్రేక్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.
Atharva: అమెజాన్‌లో అన్ని భాషల్లో ట్రెండ్ అవుతున్న ‘అథర్వ’
అసెంబ్లీ ఎన్నికల తో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తున్న నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రచారంతో పాటు తెలుగుదేశం పార్టీ ఆయన స్టార్ క్యాంపెనర్ గా కూడా వ్యవహరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల పాటు పూర్తిగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి ఆయన ఎన్నికల ప్రచారంలో దిగుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం రెండు కార్లు కూడా ఆయన సిద్ధం చేశారు. గతంలో తన కుమార్తె బ్రాహ్మణి ఇచ్చిన ఒక కారుతో పాటు మరొక కారుని కూడా ఈ ప్రచారం కోసం నందమూరి బాలకృష్ణ సిద్ధం చేశారు. తాజాగా కార్లకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నందమూరి బాలకృష్ణకు టాక్సీవాలా దర్శకుడు రాహుల్ ఒక కథ చెబితే అది ఆయనకు బాగా నచ్చిందని ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రస్తుతానికి ప్రచారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించిన క్లారిటీ అయితే లేదు.