నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ విడుదలకు సిద్ధమవుతోంది. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన హోస్ట్ గా చేయడానికి రెడీ అయ్యారు. పాపులర్ తెలుగు ఓటిటి ‘ఆహా’లో ఓ టాక్ షోను చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఈ షోకు “అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే” అనే టైటిల్ ను ఖరారు చేశారు. అక్టోబర్ 14న ఈ షో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అందులో బాలయ్య గ్రాండ్ ఎంట్రీ, నిర్మాత అల్లు అరవింద్ స్పీచ్ చూసిన ప్రేక్షకులు ఈ షో ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Read Also : హేటర్స్ కు రష్మిక దిమ్మతిరిగే రియాక్షన్
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వంటి ఇతర స్టార్స్ పాల్గొనబోయే ఈ కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్ నవంబర్ 4 న ప్రీమియర్ కానుంది. తాజాగా ఈ షోకు బాలయ్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్ సర్కిల్స్‌లో బజ్ ప్రకారం అల్లు అరవింద్ బాలయ్య తొలి డిజిటల్ షో కోసం భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నాడు. స్పష్టంగా చెప్పాలంటే బాలయ్య ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 40 లక్షలు తీసుకుంటున్నాడు. ఈ షో మొత్తం 12 ఎపిసోడ్ లతో ఉంటుంది. అంటే హోస్ట్ గా బాలయ్య దాదాపు 5 కోట్ల రూపాయలు జేబులో వేసుకుంటారన్న మాట. ఇది బాలయ్య సినిమాల రెమ్యూనరేషన్‌తో సమానంగా ఉంటుంది, కాకపోతే తక్కువ రోజులు షూటింగ్ అంతే. మరి ఈ షోతో బాలయ్య బుల్లితెర రికార్డులు బద్దలు కొడతాడేమో చూడాలి.
