Site icon NTV Telugu

బాలకృష్ణ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ చిత్రంలో నటించాల్సి ఉంది. బాలకృష్ణ నటిస్తున్న ఈ 107వ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13వ తేదీ ఉదయం 10.26 నిమిషాలకు సినిమాను ప్రారంభిస్తున్నట్టు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తెలిపారు. ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని, బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్దం చేశారని తెలుస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఆయన ఈ కథను రాశానని చెబుతున్నారు. పుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో రాబోతున్న ఈ చిత్రంలో తొలిసారి బాలకృష్ణ సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటించబోతోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Exit mobile version