Site icon NTV Telugu

Balakrishna : హీరోయిన్లకి మించిన అందం.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా బాలయ్య కుమార్తెలు

Balakrishna With Daughters

Balakrishna With Daughters

Balakrishna Daughters Brahmani Tejaswini: నందమూరి వంశం నుంచి ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా ఇండస్ట్రీకు వెచ్చించి లేదు. నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మోక్షజ్ఞ వరకు ఆ వంశం నుంచి హీరోలు మాత్రమే వస్తూ ఉంటారు. ఎన్టీఆర్ కు 12 మంది సంతానం.. అందులో 5 గురు అమ్మాయిలు. ఇక ఈ సంతానానికి పెళ్లిళ్లు అవ్వడం, వారికి అమ్మాయిలు పుట్టడం వారికి కూడా పెళ్లి అవ్వడం చూసాం కానీ ఒక్కరు కూడా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు అని కానీ, అసలు పెడతారా అన్న ఆలోచన కానీ ఎవరికి రాలేదు. నందమూరి బాలకృష్ణ కూతుర్లు బ్రాహ్మణి, తేజస్విని ఇద్దరూ అందగత్తెలే. హీరోయిన్లకు ఈ మాత్రం తీసిపోని అందం వారి సొంతం.. కానీ వీరు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది లేదు. బ్రాహ్మణి, చంద్రబాబు ఇంటి కోడలిగా, హెరిటేజ్ సంస్థ బాధ్యతలు చూసుకుంటుంది. మరోపక్క తేజస్విని భర్త వ్యాపారంతో పాటు తండ్రికి కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వ్యవహరిస్తోంది. బాలయ్య అన్ స్టాపబుల్ షో కు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా కూడా వ్యవహరిస్తోంది.

Allu Arjun: అరాచకం సార్ ఇది.. బన్నీ కోసం 1600 కి.మీ సైకిల్ తొక్కుతూ?

బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాలుగవ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు అఖండ -2 చాలా గ్రాండ్గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో బాలయ్య కూతుర్లు ఇద్దరు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణి హీరో బాలకృష్ణ, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి క్లాప్ కొట్టింది. అలాగే చిన్న కూతురు ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇలా కూతుళ్ళిద్దరూ తండ్రి సినిమా ముందుండి నడిపిస్తుండడంతో అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు కూతుర్లు కూడా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య కూతుర్ల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Exit mobile version