Balakrishna – Chiranjeevi Condolences on Ramoji Rao Death: రామోజీ రావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రల ప్రజలు, ప్రముఖులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఆయనకు బాలకృష్ణ నివాళి అర్పించారు. తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు గా వెలుగొందారు రామోజీ రావు తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శి గా నిలిచారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారు. జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారు. చిత్ర సీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో గా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. ఏది చేసినా తనదైన బాణీ కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తోంది.
Ramoji Rao: రామోజీరావు అస్తమయంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. లోకేష్ సహా టీడీపీ నేతల సంతాపం..
మా తండ్రిగారు నందమూరి తారక రామారావు గారితో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని అన్నారు. ఇక ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం .. దివి కేగింది 🙏💔 🙏 ఓం శాంతి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఏ రంగంలో అయినా, ఎలాంటి నేపథ్యం లేకపోయినా కష్టపడితే చాలు… విజయం దక్కుతుంది అనే స్ఫూర్తిని నాలాంటి ఎంతోమందికి పంచిపెట్టిన రామోజీరావు గారి జన్మ ధన్యం. తెలుగు కీర్తిని, స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారి మరణం ఈ దేశానికి, ముఖ్యంగా తెలుగు జాతికి తీరని లోటు ని నిర్మాత సి.అశ్వనీదత్ పేర్కొన్నారు.