Site icon NTV Telugu

Balagam Venu :నా బలగం నాన్న తప్ప అందరూ చూశారు.. వేణు ఎమోషనల్ పోస్ట్

Balagam Venu Emotional

Balagam Venu Emotional

Balagam Venu Emotional Post on his Fathers Death Anniversary: కమెడియన్ గా అనేక సినిమాల్లో అలరించి జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి సైతం దగ్గరయ్యాడు. వేణు తర్వాత సినిమాలతో పాటు జబర్దస్త్ కి కూడా దూరమై చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండి పోయాడు. అసలు వేణు ఏమైపోయాడో? కూడా జనాలు మరిచిపోతున్న సమయంలో బలగం అనే సినిమాతో డైరెక్టర్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో పెద్ద హిట్ కొట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందించబడిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది. దిల్ రాజు కుమార్తె దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో ప్రారంభించిన కొత్త బ్యానర్ లో ఈ సినిమా మొదటి సినిమాగా నిర్మించగా మంచి వసూళ్లు కూడా తెచ్చి పెట్టింది.

Hari Hara Veera Mallu: క్రిష్ అవుట్.. డైరెక్షన్ బాధ్యతలు ఎవరి చేతికో తెలుసా?

ఇక ఈ సినిమా తర్వాత వేణు నానితో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎల్లమ్మ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సంగతి పక్కన పెడితే తాజాగా వేణు తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. తన బలగం సినిమా అందరూ చూశారు తన తండ్రి తప్ప అంటూ ఆయన పోస్ట్ పెట్టాడు. తన తండ్రిని మిస్ అవుతున్నట్లుగా ఆయన ఫోటో షేర్ చేసి తన తండ్రి ఫిబ్రవరి 6వ తేదీ 2000 సంవత్సరంలో చనిపోయినట్లు వెల్లడించిన వేణు ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version