Balagam creates a record with 100 plus international awards: వేణు ఎల్దండి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బలగం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాదు వసూళ్ల వర్షం కూడా కురిపించింది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి నిర్మించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కేవలం క్రిటిక్స్ ప్రశంసలు అందుకోవడమే కాదు సినిమా థియేటర్స్‌లో కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఆ తరువాత ఈ సినిమా ఓటీటీలోనూ రిలీజ్ అయ్యాక అక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ బలగం సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అంతర్జాతీయంగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది అందుకే ఈ సినిమా ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది.
Devil Glimpse: రచ్చరేపిన ‘డెవిల్’ గ్లింప్స్.. సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్
అదేమంటే ఒకటి రెండు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లోని ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడి 100కి పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ బలగం సినిమాలో అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను హృద్యంగా తెరకెక్కించిన తీరు అంతర్జాతీయంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఈ బలగం సినిమా అంతర్జాతీయంగా ఎన్నో విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ‘బలగం’ సినిమా అంతర్జాతీయంగా 100 అవార్డులను సొంతం చేసుకోవటంపై మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘‘ఇదొక అద్భుతమైన మరుపురాని ప్రయాణం, ఇది వరకు మన సినిమాలు 100 రోజులు, 100 సెంటర్స్, 100 కోట్లు కలెక్ట్ చేయటం వంటి రికార్డులను సాధించాయి కానీ 100 అంతర్జాతీయ అవార్డులను సాదించటంతో బలగం సినిమా ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించగా భీమ్స్ సిసిరోలియో తన అద్భుతమైన సంగీతంతో ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకు ప్రాణం పోశారు.