NTV Telugu Site icon

Balagam: అద్భుతాలు సృష్టించడం ఇంకా ఆగలేదు… మన సినిమాకి మరో గౌరవం

Balagam

Balagam

ఖలేజ సినిమాలో ‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు’ అంటూ త్రివిక్రమ్ ఒక డైలాగ్ రాసాడు. ఈ మాట ఇండస్ట్రీ వర్గాలకి సరిపోదేమో, అది అద్భుతం అని ఎవరైనా గుర్తిస్తే కానీ కొన్ని సినిమాలు ఆడియన్స్ దృష్టికి వెళ్ళవు. అది కూడా కమర్షియల్ సినిమాలని చూడడానికి సినీ అభిమానులు థియేటర్స్ కి వెళ్తున్న సమయంలో ఒక ఎమోషనల్ సినిమా వచ్చింది, చిన్న బడ్జట్ తో, నార్మల్ కాస్టింగ్ ఆప్షన్స్ తో మన జీవితాలని చూపిస్తూ, మనందరికీ తెలిసిన ఒక కథ, మన కథతో ఒక సినిమా వచ్చింది అని పది మంది మాట్లాడుకుంటే అది ఇంకో పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటిదే బలగం సినిమా విషయంలో జరగుతోంది, దిల్ రాజు నిర్మాణంలో సరిగ్గా నెల రోజుల క్రితం రిలీజ్ అయ్యింది బలగం సినిమా. అస్సలు అంచనాలు లేకుండా, ఎలాంటి హడావుడి హంగామా చెయ్యకుండా… సైలెంట్ గా వచ్చి ప్రతి ఒక్కరినీ బలగం కట్టి పడేసింది. ఈ మధ్య కాలంలో ఇంత ఇంపాక్ట్ చూపించిన సినిమా మరొకటి రాలేదు అంటే అతిశయోక్తి కాదేమో. నెల రోజులుగా బలగం సినిమా చేసిన చప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తూనే ఉంది. తెలంగాణా కథ, కథనం అంటున్నారు కానీ ప్రతి తెలుగు వాడి ఇంట్లో జరిగే కథ ఇది. అందుకే ఒటీటీలో రిలీజ్ అయినా కూడా బలగం సినిమాని తెరలు కట్టుకోని మరీ చూస్తున్నారు.

కాంక్రీట్ జంగిల్ లో బ్రతుకుతున్న వాళ్లని కూడా కదిలించే క్లైమాక్స్ బలగం సినిమాని ప్రత్యేకంగా మార్చింది. సినిమా డబ్బులు తెస్తుంది, సినిమా అవార్డులు తెస్తుంది, సినిమా మర్యాద తెస్తుంది… డబ్బులు, మర్యాద, అవార్డులు లాంటి మూడు వేరు వేరు ఎలిమెంట్స్ ని బలగం లాంటి మంచి సినిమాలు మాత్రమే తీసుకోని రాగలవు. అందుకే ఇలాంటి సినిమాలని గుర్తించాలి, అప్పుడే మరిన్ని మంచి సినిమాలు ఆడియన్స్ ముందుకి వస్తాయి. మన కథతో తెరకెక్కిన బలగం సినిమాని వాషింగ్ టన్ డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ గుర్తించింది. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ న్యారేటివ్ కేటగిరిల్లో బలగం సినిమా అవార్డులు గెలుచుకుంది. సరిగ్గా ఇది జరిగే 24 గంటల ముందు బలగం సినిమా ఉక్రెయిన్ లో జరిగే ‘ఊన్క్యో ఫిల్మ్ ఫెస్టివల్’లో కూడా బలగం సినిమా అవార్డ్ గెలుచుకుంది. బలగం సినిమాకి వస్తున్న రీచ్ చూస్తూ ఉంటే ఎందుకో మేకర్స్ తొందరపడి ఈ సినిమాని అప్పుడే ఒటీటీకి ఇచ్చేసారేమో ప్రతి ఒక్కరికీ అనిపించకమానదు.