Bala Krishna with Basavatarakam Trust Members Met Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా టాలీవుడ్ బడాహీరోలు కలుస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక టాలీవుడ్ నుండి ముందుగా మెగాస్టార్ చిరంజీవి వెళ్లి కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో కలిసిన చిరంజీవి ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. ఇక ఆ తరువాత నేడు సీఎం రేవంత్‌రెడ్డిని టాలీవుడ్ కింగ్ నాగార్జున తన భార్య అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్‌లోని సీఎం నివాసంలో వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఇప్పుడు తాజాగా, సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన చిన్న అల్లుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.
#90’s Trailer: శివాజీ హీరోగా 90’s బయోపిక్ సిరీస్.. ట్రైలర్ అదిరిందిగా!
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో బాలకృష్ణ సహా బసవతారకం ఆస్పత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. బాలకృష్ణ, రేవంత్ గతంలో తెలుగుదేశంలో కలిసి పని చేసిన క్రమంలో వీరిద్దరూ కలిసి కాస్త సమయం గడిపారు. ఇక ఆ తరువాత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం తన తల్లిదండ్రులతో తెలంగాణ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఈ ఫొటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు ఆయన్ను కలుస్తున్న క్రమంలో లీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులంతా రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు చెబుతున్నారు.