బాలీవుడ్ లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సంజయ్ లీలా బాన్సాలీ. ఆయన సినిమాలో ఆఫర్ కోసం అగ్రశ్రేణి నటీనటులు కూడా అల్లాడిపోతుంటారు. అంతలా గ్రాండ్ గా తన మూవీస్ ని ప్రజెంట్ చేయటమే కాదు… తన యాక్టర్స్ ని కూడా బాన్సాలీ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. అయితే, ఆయన బ్రేక్ సంపాదించుకున్న తొలి చిత్రాల్లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ కూడా ఒకటి. అందులో ఐష్, అజయ్ దేవగణ్ తో పాటూ సల్మాన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించాడు. అలా బాన్సాలీతో ‘బజ్రంగీ భాయ్ జాన్’కి ప్రత్యేక అనుబంధం ఉంది.
ఎన్నో ఏళ్లుగా తనతో మంచి ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తున్న సంజయ్ బన్సాలీకి శుభాకంక్షలు తెలిపాడు సల్మాన్. ఇన్ స్టాగ్రామ్ లో ఆయన ఒక ట్రిబ్యూట్ వీడియో షేర్ చేశాడు. ’25ఇయర్స్ఆఫ్‌ఎస్ఎల్బీ’ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశాడు. ఎస్ఎల్ బీ గా బాలీవుడ్ లో పాప్యులర్ అయిన సంజయ్ లీలా బాన్సాలీ షో బిజ్ లోకి వచ్చి 25 ఏళ్లు గడిచింది. దాంతో ఆయనతో అనుబంధం ఉన్న స్టార్స్ అందరూ తమ ఫీలింగ్స్ సొషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. లెటెస్ట్ గా సల్మాన్ తన ‘బీయింగ్ సల్మాన్ ఖాన్’ ఇన్ స్టాగ్రామ్ పేజ్ నుంచీ స్పెషల్ వీడియో షేర్ చేశాడు. బన్సాలీ సినిమాల్లోంచి ఆణిముత్యాల్లాంటి సీన్స్ ఏరికోరి దీన్ని తయారు చేశారు. ‘కంగ్రాచ్యూలేషన్స్ సంజయ్ ఆన్ కంప్లీటింగ్ 25 గ్లోరియస్ ఇయర్స్’ అని కూడా సల్మాన్ క్యాప్షన్ రాశాడు…
బాన్సాలీ త్వరలో ‘గంగూభాయ్’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఆ తరువాత ‘బైజు బావ్రా’ సినిమా రూపొందించబోతున్నాడు…
