BAFTA Awards : 2022 బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ మార్చి 13 ఆదివారం లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగాయి. 75వ వార్షిక BAFTASను రెబెల్ విల్సన్ హోస్ట్ చేశారు. 2006లో చలనచిత్రం, ఆటలు, టెలివిజన్ పరిశ్రమలలో మరణించిన తారలను గుర్తించేందుకు BAFTA In Memory Of అనే కొత్త విభాగాన్ని స్థాపించింది. ఈ ఏడాది ఈ జాబితాలో లతా మంగేష్కర్ కూడా చోటు దక్కించుకున్నారు. దిగ్గజ గాయని ఫిబ్రవరి 6న తుది శ్వాస విడిచారు. BAFTA అవార్డ్స్ 2022 లతా మంగేష్కర్‌కు ప్రత్యేక నివాళులర్పించింది. ది నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ కు BAFTA ఇన్ మెమరీ ఆఫ్ విభాగంలో ప్రత్యేక హృదయపూర్వక సంస్మరణతో నివాళులు అర్పించారు.
Read Also : Jayamma Panchayathi : తుది తీర్పు వచ్చింది.. రిలీజ్ డేట్ ఫిక్స్
లతా మంగేష్కర్‌కు BAFTA ప్రత్యేక నివాళిని చూసిన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. మీ ఇన్ మెమోరియం విభాగంలో లతామంగేష్కర్‌ని చేర్చినందుకు BAFTAకి ధన్యవాదాలు, ఆమె నష్టం పూడ్చలేనిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా లతా మంగేష్కర్ భారతీయ నేపథ్య గాయకురాలు. ఆమె 70 సంవత్సరాల కెరీర్‌లో 1,000 కంటే ఎక్కువ హిందీ చిత్రాలలో 25,000 పాటలను పాడారు. మంగేష్కర్ చాలా అరుదుగా తెరపై కనిపించారు. ఆమె 1974లో రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ సంగీత కళాకారిణి. 2001లో లతా మంగేష్కర్ కు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పురస్కారాన్ని అందించి గౌరవించిన విషయం తెలిసిందే.
