Site icon NTV Telugu

Badshah : పాపులర్ సింగర్ కు యాంగ్జయిటీ డిజార్డర్‌… !

Badshah

Badshah

పాపులర్ సింగర్, ర్యాపర్ బాద్షా తనకు డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్‌ ఉందని తాజాగా వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చారు. “ఇండియాస్ గాట్ టాలెంట్ 9″షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న శిల్పా శెట్టి, బాద్షా “షేప్ ఆఫ్ యూ” అనే టాక్ షోలో మళ్ళీ కలిశారు. శిల్పా శెట్టి ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, తాజా ఎపిసోడ్ లో పాల్గొన్న బాద్షా తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “షేప్ ఆఫ్ యూ” నాల్గవ ఎపిసోడ్ లో బాద్షా తన ఫిట్‌నెస్ రహస్యాల గురించి, అలాగే క్లినికల్ డిప్రెషన్, తీవ్రమైన యాంగ్జయిటీ డిజార్డర్, స్లీప్ అప్నియాతో బాధపడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు ఒకప్పుడు పని కోసం ఆకలితో అలమటించేవాడినని కూడా చెప్పుకొచ్చాడు.

Read Also : Bigg Boss Non Stop : ఈ వారం ఈ హాట్ బ్యూటీ అవుట్ ?

షోలో బాద్షా మాట్లాడుతూ మానసిక ప్రశాంతత కోరుకుంటే స్వార్థపూరితంగా ఉండటం ముఖ్యమని అన్నారు. మానసికంగా దృఢంగా ఉండటం ఎంత ముఖ్యమని శిల్పా షోలో భాగంగా బాద్‌షాను ప్రశ్నించగా, “మానసికంగా దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. నేను జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. నా మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే క్లినికల్ డిప్రెషన్‌లో ఉన్నాను. నేను తీవ్రమైన ఆందోళన రుగ్మతతో బాధపడుతున్నాను. మానసికంగా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే స్వార్థపూరితంగా ఉండాలి. మిమ్మల్ని సంతోషపెట్టే వ్యక్తులతో మీరు జీవించాలి, సంతోషంగా ఉండాలి” అంటూ చెప్పుకొచ్చారు.

Exit mobile version