NTV Telugu Site icon

Sharukh: కింగ్ ఖాన్ చెన్నై వస్తున్నాడు… నెక్స్ట్ హైదరాబాద్ కే…

Jawan

Jawan

బాలీవుడ్ బాద్షాకింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జవాన్. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఏ బాలీవుడ్ సినిమా మైంటైన్ చేయనంత హైప్ ని జవాన్ సినిమా మైంటైన్ చేస్తుంది. ప్రాపర్ కమర్షియల్ డ్రామా పడితే షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయగలడో పఠాన్ సినిమాతో ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యింది. బ్యాడ్ ఫేజ్ లో ఉండి, అయిదేళ్లుగా సినిమానే చేయకపోయినా కూడా పఠాన్ తో వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాడు అంటే అది షారుఖ్ కి ఉన్న క్రేజ్ కి నిదర్శనం. ఓవర్సీస్ లో పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ క్రియేట్ చేసిన హవోక్ దెబ్బకి వందల కోట్లు వచ్చి పడ్డాయి. స్పై యాక్షన్ ఫిల్మ్, పెద్దగా రెగ్యులర్ ఎలిమెంట్స్ లేని సీరియస్ డ్రామాతోనే షారుఖ్ వెయ్యి కోట్లు రాబట్టాడు అంటే జవాన్ మూవీ ఇంకే రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతుందో ఊహించొచ్చు. జవాన్ సినిమాలో సూపర్బ్ సాంగ్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, స్టన్నింగ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, షారుఖ్ నెగటివ్ టచ్ ఉన్న రోల్… ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సినిమాకి కాస్త పాజిటివ్ బజ్ వస్తే చాలు బాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులకు ఎండ్ కార్డ్ పడినట్లే.

భారీ ఓపెనింగ్స్ ని టార్గెట్ చేస్తూ జవాన్ సినిమా ప్రమోషన్స్ ని చేస్తున్నారు మేకర్స్. ఈ ప్రమోషన్స్ ని నార్త్ కి మాత్రమే పరిమితం చేయకుండా సౌత్ కి స్ప్రెడ్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా జవాన్ రిలీజ్ అవుతుంది కాబట్టి సౌత్ లో సినిమాని ప్రమోట్ చేయడానికి షారుఖ్ ఖాన్ చెన్నై వస్తుండడం విశేషం. తన సినిమాలని నార్త్ లోనే ప్రమోట్ చేయకుండా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసి వదిలేసే షారుఖ్ ఖాన్… జవాన్ కోసం చెన్నైకి రావడం స్పెషల్ అనే చెప్పాలి. అట్లీకి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకోని షారుఖ్ ఖాన్ సౌత్ కి వస్తున్నాడు. ఈరోజు మధాహ్నం మూడు గంటలకి చెన్నైలోని శ్రీరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ కి షారుఖ్ రానున్నాడు. అక్కడ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి జవాన్ సినిమాని ప్రమోట్ చేయనున్నాడు షారుఖ్. నెక్స్ట్ హైదరాబాద్, బెంగళూరు, త్రివేండ్రమ్ వెళ్లే అవకాశం ఉంది. దీని వలన సౌత్ లో మంచి కలెక్షన్స్ ని రాబడితే నార్త్ నుంచి ఓవర్సీస్ నుంచి ఎలాగూ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి జవాన్ థియేట్రికల్ రన్ ఎండ్ అయ్యే టైంలో వండర్స్ క్రియేట్ అవుతాయి.