NTV Telugu Site icon

HanuMan OTT: హనుమాన్ ఓటీటీ ఎంట్రీ కోసం వెయిట్ చేసే వారికి బాడ్ న్యూస్?

Hanuman

Hanuman

Bad News to HanuMan Movie Lovers: ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఓటీటీలో కూడా దర్శనమిస్తోంది. అయితే అందుకు భిన్నంగా సంక్రాంతి సమయంలో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా ఇప్పటికీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఈ మధ్యలో 50 రోజుల ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా కూడా నిర్వహించింది సినిమా యూనిట్. ఇక ఈ సినిమా మార్చి 8వ తేదీన ఓటీటీ ఎంట్రీ ఇస్తుందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ అది నిజం కాదని తెలుస్తోంది. దీంతో ఒక రకంగా ఈ సినిమా ఓటిటి ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అందరికీ ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మార్చ్ ఎనిమిదో తేదీ నుంచి ఒకవేళ స్ట్రీమింగ్ అవుతున్నట్లయితే ఈపాటికి జీ 5 నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంటుంది.

Suhas : రెమ్యూనరేషన్ ను పెంచడం పై సుహాస్ షాకింగ్ కామెంట్స్..

కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం జీ 5 టీం నుంచి లేదు. తాజాగా ఈ విషయం గురించి ఒక నెటిజన్ జీ 5 సోషల్ మీడియా అకౌంట్ ని ట్యాగ్ చేసి అడిగితే ఈ అంశానికి సంబంధించి మాకు ఎలాంటి అప్డేట్ లేదు, మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఫాలో అవుతూ ఉండండి అప్డేట్ వచ్చినప్పుడు ఇస్తాం అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే హనుమాన్ డిజిటల్ రిలీజ్ ఇంకా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించారు. వినయ్ రాయ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ తేజ సోదరి పాత్రలో నటించింది. నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ దిశగా కొన్ని చోట్ల ఇంకా థియేటర్ లో పరుగులు పెడుతోంది.