Site icon NTV Telugu

Baby: చిన్నకొండ తోపు.. దమ్ముంటే ఆపు.. జంబలకిడి జారు మిఠాయ

Baby

Baby

Baby: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా తరువాత మరీ ఓ రేంజ్ సినిమాలు తీయలేదు కానీ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిలా అందరికి దగ్గరవ్వడానికి మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందులో కొంతవరకు సక్సెస్ కూడా అయ్యాడని చెప్పాలి. ఇక తాజాగా ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్ సరసన వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ ను ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇక తాజాగా టీజర్ గురించి అందరికి తెలియాలని మేకర్స్ సోషల్ మీడియా ట్రెండ్ ను వాడుకున్నారు. గత కొన్నిరోజుల నుంచి జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జంబలకిడి జారు మిఠాయ అని పాట పాడి ఫేమస్ గా మారిన మహిళ చేత.. బేబీ టీజర్ అనౌన్స్ మెంట్ ను సాంగ్ లా పేరడీ చేయించారు. ” బేబీ టీజర్ వస్తుంది చూడు.. బేబీ టీజర్ వస్తుంది చూడు.. ఒక్కసారి చూసావంటే మళ్లీ మళ్లీ చూస్తావ్ చూడు జంబలకిడి జారు మిఠాయ.. మన చిన్న కొండ తోపు దమ్ముంటే ఆపు” అంటూ ఆమె సాంగ్ పాడుతూ బేబీ టీజర్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా చిన్న కొండ ప్రేక్షకుల పల్స్ బాగానే కనిపెట్టాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.

https://twitter.com/sairazesh/status/1594571328589246464?s=20&t=KDNtQyX-j5IPwpFiIrmmCg

Exit mobile version