Site icon NTV Telugu

Baby: అత్యుత్తమ సినిమాల్లో బేబీ ఒకటి… ప్రభాస్ దర్శకుడి కాంప్లిమెంట్స్…

Baby

Baby

ఈ మధ్య కాలంలో చూసిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా, రియాలిటీ చూపించిన సినిమాగా ‘బేబీ’ మూవీ పేరు తెచ్చుకుంది. మూడు రోజుల్లో అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన ఈ సినిమా సెన్సేషనల్ బుకింగ్స్ ని రాబడుతుంది. యూత్ ని బేబీ మూవీ ఒక డ్రగ్ లా ఎక్కుతూనే ఉంది. మూవీ లవర్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా బేబీ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. దర్శకేంద్రుడు అంతటి వాడిని మెప్పించిన బేబీ సినిమాపై డైరెక్టర్ దశరథ్ సూపర్బ్ రివ్యూ ఇచ్చాడు. “నా జీవితంలో చూసిన అత్యుత్తమ సినిమాల్లో బేబీ ఒకటి. Great writing..Greate direction..Greatest performances.. Hats off to the director & writer @sairazesh music director @vijai_Bulganin producer @SKNonline. @ananddevarakonda @iamvaishnavi04 & @viraj_ashwin” అంటూ టీమ్ అందరినీ టాగ్ చేసి దశరథ్ ట్వీట్ చేసాడు.

ఇక దశరథ్ సినిమాల విషయానికి వస్తే కింగ్ నాగ్ కి సంతోషం లాంటి హిట్ ఇచ్చి… ప్రభాస్‌ను పర్ఫెక్ట్‌గా చూపించి ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు దశరథ్. లవ్ స్టోరీస్ తో హిట్ సినిమాలని తెరకెక్కించిన దశరథ్, చివరగా మంచు మనోజ్‌తో ‘శౌర్య’ అనే సినిమా తీశాడు, ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. అక్కడి నుంచి దశరథ్ కి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. బాగా గ్యాప్ తీసుకున్న దశరథ్, కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతూ సుడిగాలి సుధీర్‌తో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గానే సుధీర్‌కి కథ కూడా వినిపించినట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. మరి ప్రభాస్ దర్శకుడు, సుడిగాలి సుధీర్ తో హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

Exit mobile version