Baby Copy Controversy Preminchoddhu Team Seansational comments: అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ‘ప్రేమించొద్దు’ని పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందగా తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఈ కథను డెవలప్ చేసిన రవి కిరణ్ మాట్లాడుతూ.. 2012 నుంచి శిరీన్‌తో నాకు పరిచయం, అన్నపూర్ణలో డైరెక్షన్ కోర్సు చేశాను. 2015లో పేపర్ ఆర్టికల్ చూసి పోస్ట్ చేశా ఆ చిన్న ఆర్టికల్‌ను చూసి శిరీన్ కాల్ చేశాడు. స్టోరీగా మార్చి సినిమా తీద్దామన్నాడు. అమ్మాయి ఇద్దర్ని ప్రేమించింది, ఆ ఇద్దరూ కలిసి అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తారు అనే పాయింట్‌తో కథను రాసుకున్నాడు. స్కూల్ ఏజ్ అమ్మాయితే బాగుంటుందని ఆ స్టోరీ అలా అల్లుకున్నాడు. ఆ అబ్బాయిల్లో ఒకరు రిచ్, ఒకరు పూర్ అయితే బాగుంటుందని శిరీన్ ఆ రోజే నాకు చెప్పాడు.
Baby Leaks: సాయి రాజేష్ ‘బేబి’ కాపీ.. సాక్ష్యాలతో ‘బేబీ లీక్స్’ బుక్.. దర్శకుడు సంచలనం!
నేను లై డిటెక్షన్‌కు సిద్దం.. సాయి రాజేష్ సిద్దమా? అని ఆయన ప్రశ్నించారు. నేను సాయి రాజేష్‌ని పదేళ్ల క్రితమే బ్లాక్ చేశా. జూన్ 7న ప్రేమించొద్దు రాబోతోంది. శిరీన్ డ్రీమ్‌ను సాయి రాజేష్ నాశనం చేశాడు. మీడియానే న్యాయం చేయాలని అన్నారు. ఇక లాయర్ నిఖిలేష్ మాట్లాడుతూ.. ‘ఫేస్ బుక్ ద్వారా శిరీన్ పరిచయం. ఆయన తీసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశా, ఒకసారి ఆయన ఫోన్ చేసి ఈ బేబీ కాపీ గురించి చెప్పాడు. సాక్ష్యం ఎలా పట్టుకొస్తావ్ అని అడిగితే, ప్రతీ దాన్ని డేట్‌తో సహా భద్రపర్చుకున్నాడు. ఇవన్నీ చూసి షాక్ అయ్యా. ఇంత పకడ్బంధీగా దాచుకోవడం ఆశ్చర్యమేసింది. ఫిల్మ్ మేకింగ్ అంటే నాకు ఇష్టం. క్రియేటివ్ పర్సన్‌కు ఇలా జరగడం బాధగా ఉంది. పోలీసులు కూడా ఈ సాక్ష్యాలు చూసి షాక్ అయ్యారు. చీటింగ్, క్రిమినల్ కాన్‌స్పిరసీ, కాపీ రైట్ యాక్ట్‌కి సంబంధించిన పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శిరీన్ తన ప్రమోషన్స్‌లో తాను ఉంటే ఛాంబర్లుక లేఖలు రాస్తున్నారట. అందుకే ఇలా మీడియా ముందుకు వచ్చి సాక్ష్యాలను బుక్ రూపంలో తీసుకొచ్చి అందరికీ చూపిస్తున్నాడని అన్నారు