NTV Telugu Site icon

Babloo Prithviraj: భార్యను దూరం పెట్టి.. 23 ఏళ్ల యువతితో 56 ఏళ్ళ యాక్టర్ ఎఫైర్

Babloo Prithviraj

Babloo Prithviraj

Babloo Prithviraj Affair With 23 Year Old Malaysian Girl: నటుడు బబ్లూ పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే! తమిళ నటుడు అయిన ఆయన.. తెలుగులో విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు. ఇటీవల ఇంటింటి గృహలక్ష్మీ అనే సీరియల్‌తోనూ బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా ఈయనకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకి వచ్చింది. తనకంటే 33 ఏళ్లు చిన్నదైన 23 ఏళ్ల యువతితో ఆయన ఎఫైర్ నడుపుతున్నాడన్నదే ఆ వార్త సారాంశం. మరో ట్విస్ట్ ఏమిటంటే, ఆ అమ్మాయితో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడట!

ఆ అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంది? అనే విషయాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు కానీ.. ఆ అమ్మాయి మలేషియాకు చెందినదిగా తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితమే ఆ అమ్మాయిని బబ్లూ పృథ్వీరాజ్ వివాహమాడాడని, ఆమెతో కలిసి తన దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నాడని సమాచారం. త్వరలోనే తన రెండో పెళ్లికి సంబంధించిన ప్రకటనను అధికారికంగా బబ్లూ వెల్లడించనున్నాడని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. బబ్లూ పృథ్వీరాజ్‌కు 1994లో బీనా అనే మహిళతో పెళ్లయ్యింది. వీరికి 27 సంవత్సరాల అహద్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే.. ఇతడు తరచూ అనారోగ్యానికి గురవుతూ వస్తున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి.

కొన్ని సంవత్సరాల నుంచి బబ్లూ, బీనా దూరంగా ఉంటూ వస్తున్నారు. పలుమార్లు తమ మధ్య విభేదాలు తొలగించుకునేందుకు ప్రయత్నాలు చేశారు కానీ, అవి సఫలం కాలేదు. దీంతో, పూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బబ్లూ తోడు కోసం మలేషియా అమ్మాయిని ప్రేమించి, వివాహమాడినట్టు తెలుస్తోంది.