Vijayendra Prasad: రాజ్యసభలో `బాహుబలి` విజయేంద్రప్రసాద్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రఖ్యాత రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు నామినేట్ కావడం, సాక్షాత్తు దేశప్రధాని నరేంద్రమోడీ అభినందించడం ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఎంతోమందికి ఆనందం కలిగిస్తోంది. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ పేరు దేశవిదేశాల్లోని సినీజనంలో మారుమోగిపోతున్న విషయం విదితమే! `బాహుబలి` సిరీస్ తో రచయితగా విజయేంద్రప్రసాద్ యావద్భారతంతో పాటు, విదేశాలలోనూ గుర్తింపు సంపాదించారు. ఇక సల్మాన్ ఖాన్ `బజరంగీ భాయిజాన్`, కంగనా రనౌత్ `మణికర్ణిక` చిత్రాలతో బాలీవుడ్ లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారాయన. తెలుగునాట ట్రెండ్ సెట్టర్ గా నిలచిన `సమరసింహారెడ్డి` కథకుడిగా ఆయన జేజేలు అందుకున్నారు. ఆయన కలం నుండి జాలువారిన కథలతో రూపొందిన `సింహాద్రి, యమదొంగ, మగధీర, బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కంక్లూజన్“ చిత్రాలు సాధించిన విజయాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. తమిళంలో ఆయన రచనతోనే రూపొందిన విజయ్ `మెర్సల్` సైతం అక్కడి జనాలకు ఆయన కలం బలం తెలిపింది.
విజయేంద్రప్రసాద్ దర్శకుడిగానూ కొన్ని ప్రయోగాలు చేశారు. తన అన్న శివశక్తిదత్తతో కలసి `అర్ధాంగి` అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ముందుగా కీరవాణి కంపోజ్ చేసిన బాణీలకు పాటలు రాయించి, ఆ పాటల ఆధారంగా ఓ కథను తయారు చేసి దానినే `అర్ధాంగి`గా రూపొందించడం అప్పట్లో చర్చనీయాంశమయింది. శ్రీకాంత్ హీరోగా `శ్రీకృష్ణ 2006`, నాగార్జునతో `రాజన్న`, వైవిధ్యంగా తెరకెక్కించిన `శ్రీవల్లి`లో కూడా ఆయన ప్రయోగాలు చేశారు. అయితే ఇప్పటి దాకా దర్శకునిగా సరైన సక్సెస్ అయితే విజయేంద్రప్రసాద్ దరి చేరలేదు. ఏది ఏమైనా రచయితగా విజయేంద్రప్రసాద్ విశేషఖ్యాతిని ఆర్జించారు. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం లభించడం పట్ల తెలుగు చిత్రసీమలో సర్వత్రా ఆనందం వెల్లి విరుస్తోంది. మరి `బాహుబలి` రచయితగా విశేషమైన పేరు సంపాదించిన విజయేంద్రప్రసాద్ రాజ్యసభలోనూ తన బాణీ, వాణీ వినిపిస్తారని ఆశిద్దాం.
Also Read
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
- The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..