Site icon NTV Telugu

Baahubali – The Epic : వార్ 2, కూలీతో పాటు.. థియేటర్స్‌లో జక్కన్న సర్‌ప్రైజ్ ప్లాన్!

Bahubali

Bahubali

ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన రెండు ఎపిక్ చిత్రాలు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇప్పుడు ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాహుబలి మొదటి భాగం విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఈ ప్రత్యేక ప్రయోగానికి సిద్ధమయ్యారు. రెండు భాగాల కలయికతో రూపొందిన ‘బాహుబలి: ది ఎపిక్’ అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Also Read : Kiara : నేను నీ డైపర్లు మారిస్తే.. నువ్వు నా ప్రపంచాన్నే మార్చేశా‌వ్

రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే, బాహుబలి: ది ఎపిక్ ఎడిటింగ్‌పై పర్సనల్‌గా పర్యవేక్షిస్తున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్‌కు కూడా డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. తాజా టాక్ ప్రకారం, ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల కానున్న రెండు భారీ సినిమాలు ‘వార్ 2’ (హృతిక్ రోషన్, ఎన్టీఆర్) , ‘కూలీ’ (రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్) తో పాటు ‘బాహుబలి: ది ఎపిక్’ టీజర్‌ను కూడా థియేటర్లలో స్క్రీన్ చేయనున్నారు. అంటే, ఈ రెండు సినిమాల కోసం థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు బాహుబలి టీజర్ ఒక సర్‌ప్రైజ్‌గా అందనుంది. ఇప్పుడు ఫ్యాన్స్ మదిలో ఒకే ప్రశ్న.. రెండు పార్ట్‌లను కలిపి ఒకటిగా చేయడానికి ఎన్ని సీన్స్ కట్ అవుతాయి? కొత్త సన్నివేశాలు ఉంటాయా? మొత్తం నిడివి ఎంత అవుతుంది? అన్న కుతూహలం పెరిగిపోతోంది. రీసెంట్‌గా టాలీవుడ్‌లో పెరిగిన రీ-రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా, రెండు భాగాలను ఒకటిగా మలిచిన మొదటి ప్రాజెక్ట్ ఇది కావడం కూడా ప్రత్యేకం.

Exit mobile version