NTV Telugu Site icon

Baahubali: బాహుబలి మళ్ళీ వస్తున్నాడు.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Bbb

Bbb

Baahubali: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత పెద్ద హిట్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా స్థితి గతి మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాంటి సినిమాకి సంబంధించి ఒక యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది. బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడగా ఈరోజు ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ప్లాట్ఫారం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసింది.

Also Read; Rajamouli : ఆ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాజమౌళి..?

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 17వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. బాహుబలి సినిమాలో చర్చించని విషయాలను ఈ సినిమాల్లో చూపించబోతున్నట్లుగా ట్రైలర్ కట్ చూస్తే అర్థమవుతుంది. రక్తదూత్ అనే శత్రు రాజు ఆయుష్మతి సింహాసనానికి కట్టు బానిస అని చెప్పుకునే కట్టప్ప నే తన సేనాధిపతిగా నియమించుకొని మాహిష్మతి రాజ్యం మీదకు దండెత్తినట్లుగా చూపిస్తున్నారు. సింహాసనం కోసం ఎప్పుడు బాహుబలిని తప్పించాలా అని ఎదురుచూసే భల్లాలదేవ ఈ క్రమంలో తన సోదరుడు బాహుబలితో కలిసి రక్తదూత్ ను ఎదిరిస్తాడా? లేదా? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ యానిమేటెడ్ సిరీస్ తెరకెక్కినట్లు కనిపిస్తోంది. హాట్స్టార్ స్పెషల్ గా ఈ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేశారు.

Show comments