Site icon NTV Telugu

Ayudha Pooja: సైలెంటుగా యూట్యూబ్ లోకి ‘ఆయుధ పూజ’

Devara Juke

Devara Juke

Ayudha Pooja Song Released with Devara Juke Box: దేవర టీం ముందు నుంచి ఊరిస్తూ వస్తున్న ఆయుధ పూజ సాంగ్ సైలెంట్ గా వదిలేసింది సినిమా యూనిట్. నిజానికి దేవర సినిమాలో ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుందంటూ సినిమా యూనిట్ తో పాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తూ రిలీజ్ చేస్తారు అనుకుంటే మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ ఉందనగా జ్యూక్ బాక్స్ లో చివరి సాంగ్ గా వదిలేశారు. ఇక ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అద్దిరిపడే అంటూ సాగుతున్న ఈ సాంగ్ ఆసక్తికరంగా కనిపిస్తోంది.

Devendra Fadnavis: ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ఓటర్లకు ఇష్టం లేదు..

రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా అనిరుద్ అందించిన సంగీతం ఒక రేంజ్ లో పేలేలాగానే అనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా తెరకెక్కింది. రెండు భాగాలుగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అందులో మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు ఇతర భాషల నటీనటులు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సాంగ్ మీరు కూడా వినండి.

Exit mobile version