Site icon NTV Telugu

First Look Poster: ‘అధర్వ’ నుండి కథానాయిక ఐరా పోస్టర్!

Ayraa From Atharva

Ayraa From Atharva

Ayraa First Look Poster Released From Atharva: యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘అధర్వ’. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మహేష్ రెడ్డి డైరెక్షన్ లో సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. ‘ది సీకర్ ఆఫ్ ది ట్రూత్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో అదే జోష్‌లో తాజాగా హీరోయిన్ ఐరా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ కన్ఫమ్ చేయగా.. ఇప్పుడు ఐరా లుక్‌తో గ్లామర్ టచ్ కూడా ఉంటుందని, ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేస్తూ ఈ సినిమా రూపొందించారని స్పష్టం అవుతోంది.

‘నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’ అంటూ మోషన్ పోస్టర్‌లోని డైలాగ్ అందరిలోనూ ‘అధర్వ’ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. హీరో కార్తీక్ రాజు పవర్‌ఫుల్ రోల్‌ పోషించినట్టు గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ ను బట్టి అర్థమైంది. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని నిర్మాత సుభాష్‌ చెబుతున్నారు. ”డీజే టిల్లు, మేజర్” లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మారిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ఇందులోముఖ్యపాత్రలు పోషించారు.

Exit mobile version