NTV Telugu Site icon

NTR: ఎన్టీఆర్ తో బ్రహ్మాస్త్ర డైరెక్టర్ భేటీ .. వార్ 2 మొదలు..?

Ntr

Ntr

NTR: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా .. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శరవేగంగా దేవర షూటింగ్ ను ఫినిష్ చేస్తున్నాడు తారక్. దేవర తరువాత ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెల్సిందే. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా నటించిన వార్ కు సీక్వెల్ గా వార్ 2 సిద్దమవుతుంది. ఇక వార్ 2 లో టైగర్ ష్రాఫ్ ప్లేస్ లో ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు. ఇక ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Leo: లియో దాస్.. ట్రైలర్ తోనే సెన్సేషన్ సెట్ చేసేలా ఉన్నాడే

ఇక తాజాగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. హైదరాబాద్ కు వచ్చాడు. ఎన్టీఆర్ ను కలిసి వార్ 2 కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టేముందు ఎన్టీఆర్ ను కలిసి కథను వినిపించడానికి వచ్చాడని తెలుస్తోంది. ఈ మీటింగ్ పూర్తీ అయిన తరువాత ఎన్టీఆర్ తన డేట్స్ ను అద్జుస్త్ చేయనున్నాడట. ఎంత వీలైతే అంత త్వరగా దేవర షూటింగ్ ను ఫినిష్ చేసి వార్ 2 ను మొదలుపెట్టాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడట. మరి దేవర ఎప్పుడు పూర్తవుతుందో.. వార్ 2 ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Show comments