Site icon NTV Telugu

Ayalaan: శివ కార్తీకేయన్ అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా.. అసలు ఏమైందంటే?

Ayalaan

Ayalaan

Ayalaan Movie Telugu Version Postponed again: శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఏలియన్ సినిమా అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి బరిలో తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ అయింది. దాదాపు 100 కోట్ల రూపాయలు పైగా అక్కడ వసూళ్లు రాబట్టి సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచింది. అయితే సంక్రాంతి సమయంలోనే తెలుగులో కూడా రిలీజ్ కావాల్సి ఉంది కానీ అప్పటికే నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ కి ఉండడంతో స్క్రీన్స్ సర్దుబాటు చేయలేమని భావించి రెండు వారాలు వెనక్కి వాయిదా వేశారు. ఇక లెక్క ప్రకారం ఈరోజు సినిమా రిలీజ్ కావాల్సి ఉంది కానీ సినిమా ఈరోజు కూడా రిలీజ్ కాకుండా వాయిదా పడింది. అయితే ఈ రిలీజ్ వెనుక ఉన్న కారణం తమిళ నిర్మాత అని తెలుస్తోంది. తమిళ నిర్మాత కోటపాడి జె రాజా ఈ సినిమాని నిర్మించారు.

Padma Awards 2024: తైవాన్ పౌరుడికి పద్మభూషణ్ అవార్డు.. ఎందుకో తెలుసా..?

ఆయనకు ఏర్పడిన కొన్ని లీగల్ సమస్యల కారణంగా తెలుగు రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్నింగ్ షోలన్ని రద్దు అయ్యాయి. ఈ రోజు బుక్ మై షోలో కూడా బుక్ చేయాల్సిన అన్ని షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న వారికి డబ్బులు రిఫండ్ చేస్తున్నారు బుక్ మై షో నిర్వాహకులు. ఇక ఈ లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసుకుని తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు తెలుగు నిర్మాత మహేశ్వర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా మరొక రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ఏలియన్ హాట్ టాపిక్ అయింది, తమిళంలోనే కాదు ఇండియా మొత్తం మీద ఎక్కువ శాతం ఏలియన్ తోనే చేసిన సినిమాగా ఈ సినిమా రికార్డులకు కూడా ఎక్కింది.

Exit mobile version