Awaraapan 2: ఇమ్రాన్ హష్మీకి అగ్ని పరీక్ష.. ‘బట్వారా 1947’ క్లాష్‌తో సీక్వెల్‌కు టెన్షన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Awaraapan 2: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కల్ట్ క్లాసిక్ ‘ఆవారాపన్’కు సీక్వెల్‌గా వస్తోంది ‘ఆవారాపన్ 2’. ఈ మూవీపై ప్రకటన వచ్చినప్పుడు అభిమానుల్లో ఉత్సాహం బాగా కనిపించింది. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ పరిస్థితులు మారుతున్నాయి. ఆగస్టు 14న ఈ మూవీ థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. ఇదే రోజు సన్నీ డియోల్ నటిస్తున్న ‘బట్వారా 1947’ కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు ఏర్పడుతోంది. ఇమ్రాన్ హష్మీ కెరీర్లో అత్యంత గుర్తింపు తెచ్చుకున్న సినిమాలలో ‘ఆవారాపన్’ కూడా ఒకటి. 2007లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ వసూళ్లు సాధించకపోయినా, కాలక్రమేణా కల్ట్ స్టేటస్ సంపాదించింది. ముఖ్యంగా ఇందులోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. అదే ఎమోషన్ కొనసాగిస్తూ ‘ఆవారాపన్ 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఈసారి సీక్వెల్‌పై మొదట కనిపించిన ఉత్సాహం క్రమంగా తగ్గిందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
దీనికి ప్రధాన కారణం ప్రమోషనల్ అప్డేట్లు ఆశించిన స్థాయిలో లేకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే రిలీజ్ చేసిన ‘వే జునూన్’, ‘యే ఆవారాపన్’ పాటలకు కూడా మిక్స్డ్ స్పందనే లభించింది. సాధారణంగా ఇమ్రాన్ హష్మీ సినిమాల్లో సంగీతమే హైలెట్ గా నిలుస్తుంది. అరిజిత్ సింగ్ వంటి గాయకుడు ఉన్నప్పటికీ ఈసారి ఆ మ్యాజిక్ మాయ చేయలేదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. మరోవైపు సన్నీ డియోల్ నటిస్తున్న ‘బట్వారా 1947’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దేశ విభజన నేపథ్యంలో సాగే కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ‘ఘాయల్’, ‘దామిని’, ‘ఘటక్’ వంటి సూపర్‌హిట్ చిత్రాలు అందించిన సన్నీ డియోల్–రాజ్‌కుమార్ సంతోషి కాంబినేషన్ మరోసారి కలిసి రావడం సినిమాకు కాలసొచ్చేలా కనిపిస్తోంది.
Also Read
- Suriya - Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' సెన్సార్.. 'A' సర్టిఫికెట్
- Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
ఈ రెండు సినిమాల మధ్య ఉన్న మైన్ తేడా కూడా అదే. ‘బట్వారా 1947’ దేశభక్తి, చారిత్రక నేపథ్యాన్ని నమ్ముకుని వస్తుంటే, ‘ఆవారాపన్ 2’ మాత్రం ఇమ్రాన్ హష్మీ ఐకానిక్ ఇమేజ్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. అందుకే ఈ క్లాష్‌ను ట్రేడ్ వర్గాలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇక ఆగస్టు 14 విడుదలవుతున్న ఈ రెండు సినిమాలలో ప్రేక్షకులు ఎవరికి పట్టం కడతారో చూడాలి. దేశభక్తి కథకు ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతారా? లేక కల్ట్ క్లాసిక్ సీక్వెల్ మరోసారి మ్యాజిక్ చేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం బాక్సాఫీస్ ఫలితాలే చెప్పనున్నాయి.
- Tags
- Awaraapan 2
- cinema
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?