Awarapan 2: ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బత్వారా 1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ

Venkyatluri1

Venkyatluri1

Awarapan 2: ఒకప్పుడు కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘అవారపన్’ కథకు సీక్వెల్ గా వచ్చిన ‘అవారపన్ 2’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14న సన్నీ డియోల్ ‘బత్వారా 1947’తో పోటీగా విడుదలైన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజే భారీ ఓపెనింగ్ నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనర్‌గా నిలవడంతో ఈ విక్టరీకి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం, ‘అవారపన్ 2’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.27.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. ఈ కలెక్షన్లతో ‘అవారపన్ 2’ మరో అరుదైన ఘనతను కూడా సాధించింది. 2007లో విడుదలైన అసలు ‘అవారపన్’ చిత్రం తన పూర్తి రన్‌లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన సుమారు రూ.12 కోట్ల వసూళ్లను ఈ సీక్వెల్ ఒక్క రోజులోనే అధిగమించింది. అంటే తొలి రోజే ఒరిజినల్ సినిమా లైఫ్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టడం విశేషంగా మారింది.

మరోవైపు ఇదే రోజు విడుదలైన సన్నీ డియోల్ ‘బత్వారా 1947’ ఆశించిన స్థాయిలో ఆరంభం అందుకోలేకపోయింది. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ముందే మంచి అంచనాలు ఉన్నప్పటికీ, అవి బాక్సాఫీస్ వద్ద ఫలితాలుగా మారలేదు. భారతదేశంలో తొలి రోజు సుమారు రూ.5 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ చిత్రం, విదేశాల్లో మరో రూ.1.5 కోట్లకు పైగా మాత్రమే రాబట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వసూళ్లు సుమారు రూ.8.34 కోట్ల వద్దే ఆగిపోయాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే, ‘అవారపన్ 2’ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ‘బత్వారా 1947’ కంటే మూడు రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించి స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా యూత్ నుంచి ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది.

‘అవారపన్ 2’కు నితిన్ కక్కర్ దర్శకత్వం వహించగా, ఇమ్రాన్ హష్మీతో పాటు దిశా పటానీ, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటించారు.  మరోవైపు ‘బత్వారా 1947’లో సన్నీ డియోల్ నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం ఆశించిన ఊపు కనిపించలేదు. తొలి రోజు రికార్డు స్థాయి ఓపెనింగ్‌తో ‘అవారపన్ 2’ ఇప్పుడు వీకెండ్‌లో మరింత భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే, ఇమ్రాన్ హష్మీ కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా ఈ సీక్వెల్ నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.