Comedy entertainer: ఏవీయస్ తనయుడి ‘భళా చోర భళా’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు, దర్శకుడు స్వర్గీయ ఏవీయస్ తనయుడు ప్రదీప్ సైతం తండ్రి బాటలోనే సాగుతున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించిన ఎ. ప్రదీప్ ఇప్పుడు దర్శకుడిగానూ మారాడు. ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రధారులుగా ప్రదీప్ ‘భళా చోర భళా’ అనే సినిమాను తెరకెక్కించారు. యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ ను ఎ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 26న విడుదల కానుంది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఈ సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో నటుడు ఆలీ సోదరుడు ఖయ్యుమ్ మాట్లాడుతూ, ”ఇది కంప్లీట్ నెపోటీజమ్ మూవీ అనొచ్చు! ఎందుకంటే ఇందులో అందరం సీనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన వాళ్ళమే ఉన్నాం. ప్రదీప్ నాకు ఏవీఎస్‌గారి అబ్బాయిగా 20ఏళ్ల క్రితమే తెలుసు. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ స్నేహంతోనే ఇద్దరం కలిసి వర్క్ చేయాలనుకున్నాం. కోవిడ్ టైం లోనే ప్రదీప్ నాకు స్టోరీ చెప్పారు. వినగానే నాకు బాగా నచ్చింది. కథ నచ్చిన రెండో రోజే షూటింగ్ అన్నాడు. 9 డేస్, 8 నైట్స్ లో షూట్ కంప్లీట్ చేసి, రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా పూర్తి చేసి రిలీజ్‌కి సిద్ధం చేశాడు. ఇది మంచి సినిమా. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు. ‘అవును’ ఫేమ్ చంటి తాను ఇందులో నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నట్టు చెప్పారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎవరినీ డిజప్పాయింట్ చేయదని చంటి హామీ ఇస్తున్నాడు. డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ, ”లిమిటెడ్ బడ్జెట్ తో లిమిటెడ్ డేస్‌లో మంచి సినిమా చేయాలని ప్లాన్ చేశాను. అదే ‘భళా చోర భళా’గా మీ ముందుకు రాబోతోంది. మా నాన్న ఏవీయస్ గారిపై ఉన్న అభిమానంతో సినిమా వారందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన లేకపోయినా మాకు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ సినిమాను ఆగస్ట్ 26న మా అమ్మగారి పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్నాం” అని అన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!