రిలీజ్ కి ముందు సెన్సేషన్ గా నిలిచింది ‘లస్ట్ స్టోరీస్ 2’. తమన్నా, కాజోల్, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ వెబ్ సీరీస్ ని చూడడానికి చాలా మంది ఈగర్ గా వెయిట్ చేసారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లతో యూత్ లో హీట్ పెంచడంతో ‘లస్ట్ స్టోరీస్ 2’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసారు. ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ లో సీరీస్ స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ బోల్డ్ సీరీస్ లో సీన్స్ కోసం కుర్రాళ్లంతా చేసిన వెయిటింగ్ ని, మేకర్స్ బూడిదలో చేసిన పన్నీరులా అయిపొయింది. ప్రమోషనల్ కంటెంట్ లో చూసిందే తప్ప, అంతకు మించి సీరీస్ లో ఏమీ లేదు అనే కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియా హైప్ తప్ప సీరీస్ లో ఏమీ లేదనే మాట ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది.
Read Also: Salaar: 90 సెకండ్స్ టీజర్ లాక్… రికార్డ్స్ అన్నీ బ్రేక్…
సీరీస్ లో ఉన్న హాట్ సీన్స్ కి సంబంధించిన టైమ్ కోడ్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ టైమ్ కోడ్ లో ఉన్న సీన్స్ వరకు చూసి మిగిలింది చూడడం ఆపేస్తున్నారు. అసలు కథలో ఎమోషన్ లేకపోవడమే నెగటివ్ కామెంట్స్ ని కారణం అయ్యింది. కొద్దోగొప్పో కాజోల్ కథకి కాస్త మంచి పేరొస్తుంది. ఇక మృణాల్ చేసిన ఎపిసోడ్స్ విషయంలో మరింత ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. మృణాల్ ఎపిసోడ్స్ లో విషయం లేదు అని చెప్పేస్తున్నారు. అయితే చూడడానికి హీరోయిన్స్ గ్లామర్ గా ఉండడంతో లస్ట్ స్టోరీస్ 2 ఒకసారి చూసి వదిలేయడమే తప్ప, కాసేపు మాట్లాడుకోవడానికి కూడా ఏమీ లేదు. జస్ట్ వీకెండ్ టైం పాస్ కోసం ఒకసారి అలా రఫ్ గా చూడొచ్చు అంతే.
