Avengers Doomsday: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది ‘అవెంజర్స్: డూమ్స్‌డే’. ఐరన్ మ్యాన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఇప్పుడు అదే MCUలో డాక్టర్ డూమ్‌గా విలన్ అవతారం ఎత్తడం అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని పెంచుతోంది. తాజాగా D23: ది అల్టిమేట్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్‌లో విడుదలైన ప్రత్యేక ప్రోమో ఈ అంచనాలను మరింత పెంచేసింది. మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫైజీతో పాటు రాబర్ట్ డౌనీ జూనియర్ వేదికపై ఈ ప్రోమోను ఆవిష్కరించారు. రెండు నిమిషాల పది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో విక్టర్ వాన్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్ శక్తివంతమైన లుక్‌లో కనిపించారు. భారీ సింహాసనంపై కూర్చున్న డాక్టర్ డూమ్ చుట్టూ ఏర్పడిన మల్టీవర్స్ ప్రమాదాన్ని ఈ ప్రోమో మొదటిసారిగా స్పష్టంగా చూపించింది.
ఈ ప్రోమోలో అత్యంత హైలైట్‌గా నిలిచింది థోర్, డాక్టర్ డూమ్ మధ్య పోరాటం. స్టార్మ్‌బ్రేకర్‌తో దాడి చేసిన థోర్‌ను డూమ్ తన గ్రీన్ పవర్ తో వెనక్కి విసిరేయడం అతడి అపారమైన శక్తికి సంకేతంగా కనిపించింది. అలాగే మల్టీవర్స్ నుంచి వచ్చిన హీరోలు ఒకే చోట చేరి ఇప్పటివరకు ఎదురుకాని ముప్పును ఎదుర్కోబోతున్నారని ఈ ప్రోమో వెల్లడించింది.ఈ చిత్రంలో క్రిస్ ఎవాన్స్, క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్, ఆంథోనీ మాకీ, ఫ్లోరెన్స్ ప్యూ, చానింగ్ టాటమ్, సిము లియు, టామ్ హిడిల్‌స్టన్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, లెటిషియా రైట్‌తో పాటు ఫాక్స్ ఎక్స్‌మెన్ యూనివర్స్ నుంచి ఇయాన్ మెక్‌కెల్లెన్, ప్యాట్రిక్ స్టీవర్ట్, జేమ్స్ మార్స్‌డెన్ వంటి దిగ్గజ నటులు కూడా కనిపించనున్నారు. దీంతో ఇది MCU చరిత్రలోనే అతిపెద్ద మల్టీవర్స్ క్రాస్‌ఓవర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి కెవిన్ ఫైజీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైఖేల్ వాల్డ్రాన్, స్టీఫెన్ మెక్‌ఫీలీ కథను రూపొందించారు. ఇది MCU ఫేజ్ సిక్స్‌లో 39వ చిత్రంగా నిలవనుండగా, దీని తర్వాత ‘అవెంజర్స్: సీక్రెట్ వార్స్’ రానుంది. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ 2026 డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇండియాలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐరన్ మ్యాన్‌గా చరిత్ర సృష్టించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఇప్పుడు డాక్టర్ డూమ్‌గా ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

