Site icon NTV Telugu

Avatar 2: రిలీజ్ కు ముందే అవతార్ 2 కు షాక్.. నెట్టింట సినిమా మొత్తం లీక్

Avatar

Avatar

Avatar 2: ఒక్కరోజు.. ఇంకొక్క రోజు.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అద్భుతం కళ్ళముందు ప్రత్యక్షమవబోతోంది. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా.. అభిమానులు వెయ్యి కళ్ళతో వెయిట్ చేసిన సినిమా.. రేపు రిలీజ్ కానుండడంతో దాని కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. అసలు ఏమైంది.. ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా.. డిసెంబర్ 16 ప్రపంచం మొత్తం ఏ సినిమా కోసం ఎదురుచూస్తోంది.. అవతార్ 2.

స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని భాషల్లో రేపు థియేటర్ లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఒక్క రాత్రి గడిస్తే చాలు థియేటర్ లో జేమ్స్ చేసిన అద్భుత సృష్టి చూడొచ్చు అనుకొనేలోపు నెట్టింట అవతార్ 2 సినిమా లీక్ అయ్యింది. టెలిగ్రామ్ అవతార్ 2 థియేటర్ ప్రింట్ ఉందని పలువురు నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఈ వార్త మేకర్స్ కు భారీ షాక్ కు గురిచేస్తోంది. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా పైరసీ బారిన పడింది.అయితే అది ఎక్కడ ఎలా తీశారు అనేది సమాచారం లేదు. ఇక అవతార్ 2 ఫ్యాన్స్ మాత్రం పైరసీ చూడవద్దని చెప్పుకొస్తున్నారు. రేపటిలోగా ఆ ప్రింట్ ను డిలీట్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. మరి రేపు ఈ సినిమా టాక్ ఎలా ఉండనుండో చూడాలి.

Exit mobile version