జ్యోతిష్యాన్ని నమ్మడం, నమ్మకపోవడం వారి వారి నమ్మకాలను బట్టి ఉంటుంది. అయితే కొంతమంది జ్యోతిష్యులు చెప్పినవి చెప్పినట్లు జరిగితే కొన్నిసార్లు నమ్మకతప్పదు అనిపిస్తుంది. అలాంటి జ్యోతిష్యుల్లో ఒకరు వేణుస్వామి.. ఈయన గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత మరియు నాగ చైతన్యలకు పెళ్లి జరిగితే ఎక్కువ కాలం కలిసి ఉండే అవకాశం లేదు అని చెప్పి సంచలనం సృష్టించాడు. ఆయన మాటలు అప్పుడు లెక్కచేయకపోయినా నిజం సామ్- చై విడాకులు తీసుకునే సరికి వవేణుస్వామి వ్యాఖ్యలపై అందరికి నమ్మకం కుదిరింది. ఇక మరోసారి వేణు స్వామి గురించి అదే చర్చజరుగుతోంది. అందుకు కారణం నయనతార.. కోలీవుడ్ బ్యూటీ నయన్ జీవితం గురించి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమెకూడా సమంత లానే పెళ్లి చేసుకున్న కొన్ని ఏళ్లలోనే విడాకులు తీసుకొని విడిపోతుందని, ఆమె జాతకంలో పెళ్లి అచ్చిరాదని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో నయన్ పెళ్లిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నయన్, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం విదితమే. ఈ ప్రేమ పాకాన పడి జూన్ 9 న ఈ జంట వివాహంతో ఒక్కటికానున్నారు. ఇక ఈ సమయంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. నయనతారకు వివాహం కలిసి రాదని, ఆమెకు గురుడు నీచ స్థితిలో ఉండడం వలన వైవాహిక జీవితంలో కలతలు.. గొడవలు జరిగే అవకాశం ఉందని, తద్వార భర్త నుండి విడిపోయే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో అభిమానులు.. ఏంటీ స్వామి శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే అపశకునం మాట్లాడుతున్నారు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి కూడా వేణుస్వామి మాటలు నిజమవుతాయా..? లేక ఇది కూడా ప్రమోషనల్ గా వాడుకుంటాడా..? అనేది తెలియాల్సి ఉంది.
