NTV Telugu Site icon

Dance Icon: ఆహా ‘డాన్స్ ఐకాన్’ విన్నర్స్ అసిఫ్‌, రాజు

Contestant Asif Won

Contestant Asif Won

Asif Raju Won Aha Dance Icon: తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తొలిసారిగా డాన్స్ అభిమానుల కోసం అందించిన డాన్స్ షో ‘డాన్స్ ఐకాన్’. దాదాపు 13 వారాల పాటు సాగిన ఈ డాన్స్ షో ఫినాలే ఆదివారం ముగిసింది. ఈ షో విన్నర్‌గా అసిఫ్ అతని డాన్స్ మాస్టర్ రాజు నిలిచారు. విజేతగా నిలిచిన అసిఫ్‌కి 20 లక్షల నగదుతో పాటు ట్రోఫీ దక్కింది. ఇక అసిఫ్‌ను తీర్చిదిద్దిన రాజుకు ఏకంగా ఓ స్టార్ హీరో సినిమాలో డాన్స్ కంపోజ్ చేసే ఛాన్స్ కూడా దక్కటం విశేషం. ఈ షో ఫినాలేలో అల్లు అరవింద్‌తో పాటు, మైత్రీ రవిశంకర్, ఎస్ విసీసీ బాపినీడు, సితార నాగవంశృ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విన్నింగ్ కొరియోగ్రాఫర్ రాజు మాట్లాడుతూ ‘డాన్స్ ఐకాన్‌గా నిలివటం మర్చిపోలేని జర్నీ. నా తోటి కొరియోగ్రాఫర్స్ ఛాలెంజ్ చేస్తూ వచ్చినా నా గైడెన్స్‌లో రాజు విజేతగా నిలవటం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఈ షోను విజయవంతం చేసిన ఆడియన్స్‌కు, ఆహా యాజమాన్యానికి నా కృతజ్ఞతలు’ అని అన్నారు. ఈ షోను మర్చిపోలేని జ్ఞాపకం నిలబెట్టిన పోటీదారులకు, కొరియోగ్రాఫర్స్‌కి ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ థ్యాంక్స్ చెప్పారు. అయితే ఈ షో ప్రతి ఏటా ఉంటుందా? లేదా? అన్న విషయంపై ఆహా యాజమాన్యం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.