NTV Telugu Site icon

Devaki Nandana Vasudeva: ‘దేవకి నందన వాసుదేవా’ అంటున్న మహేష్ మేనల్లుడు

Ashok Galla Devaki Nandana Vasudeva Teaser Released

Ashok Galla Devaki Nandana Vasudeva Teaser Released

Mahesh Babu Nephew Ashok Galla Devaki Nandana Vasudeva Teaser Released:’హీరో’ చిత్రంతో గ్రాండ్ గా డెబ్యూ చేసిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండో సినిమా ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా #AshokGalla2 పేరుతో పిలుస్తూ వచ్చిన ఈ సినిమాకి దేవకి నందన వాసుదేవా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించగా బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాను లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో అశోక్ గల్లా కు జోడిగా మిస్ ఇండియా 2020 మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది.

Oori Peru BhairavaKona: ఈగల్ సింగిల్ రిలీజ్ కష్టమే..భైరవ కోన కూడా దిగేస్తోంది!

ఇక రిలీజ్ అయిన టీజర్ చూస్తే పల్లెటూరి బ్యాక్‌గ్రౌండ్ లో ఈ మూవీ సాగబోతోందనిపిస్తోంది. బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో కార్తికేయతో ‘గుణ 369’ సినిమాని తెరకెక్కించగా కమర్షియల్ హిట్ కొట్టింది. ఈ చిత్రంలో అశోక్ గల్లా రగ్గడ్, మాస్ లుక్‌లో కనిపిస్తారు. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ధమాకా, బలగం సినిమాలకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్, తమ్మిరాజు ఎడిటర్. ఇక ఈ టీజర్ ను గుంటూరు కారం థియేటర్లలో ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.