Ashika Ranganath: జూనియర్ అనుష్క అనిపించుకోవడం హ్యాపీనే.. నా సామిరంగ భామ ఆషిక రంగనాధ్ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashika Ranganath Interview about Naa Saami Ranga Movie: కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నా సామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
దర్శకుడు విజయ్ బిన్నీ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఎలా అనిపించింది ?
– చాలా సర్ ప్రైజ్ అయ్యా. నాలాంటి న్యూ కమ్మర్ కి నాగార్జున లాంటి బిగ్ స్టార్ తో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఇందులో వరాలు అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత ఉంది. రెండు వేరియేషన్స్ లో నా పాత్ర కనిపిస్తుంది, పాత్రపై చాలా నమ్మకంగా ఉన్నాను. తప్పకుండా వరాలు పాత్ర అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది.
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
మీ పాత్రలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
-వరాలు చాలా స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథానాయికల పాత్రలు కొంచెం సున్నితంగా ఉంటాయి. కానీ వరాలు పాత్ర మాత్రం రెబల్. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మాయి అంటే ఇలా ఉండాలనే భావన కలిగించే పాత్ర ఇది. అలాంటి పాత్ర చేయడం చాలా ఎక్సయిటింగా అనిపించింది. నా సామిరంగ తెలుగుదనం ఉట్టిపడే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్, తప్పకుండా అందరినీ అలరిస్తుంది.
నాగార్జునతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-నాగార్జునతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి. నాగార్జున ఛార్మింగ్, అమేజింగ్ పెర్ఫార్మర్. అలాంటి పెద్ద స్టార్ తో పని చేయడం నిజంగా నా అదృష్టం. నాగార్జున చాలా స్వీట్ పర్సన్. అంత పెద్ద స్టార్ వున్న ఈ చిత్రంలో వరాలు లాంటి అద్భుతమైన పాత్ర దక్కడం చాలా లక్కీగా ఫీలవుతున్నాను.
ఇందులో నాగార్జున పాత్రకు, మీ పాత్రకు మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ?
నాగార్జున రొమాంటిక్ హీరో. ఈ చిత్రంలో కూడా కథకు అనుగుణంగా మా పాత్రల మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ వున్నాయి, అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ పాత్రలకు కూడా ప్రత్యేకమైన రొమాంటిక్ స్టోరీస్ వున్నాయి. పాత్రలన్నీ చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇందులో నరేష్, రాజ్ తరుణ్ తో చాలా మంచి కాంబినేషన్ సీన్స్ వున్నాయి. ఇవన్నీ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచుతాయి.
ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
కీరవాణి స్వరపరచిన మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇలా అనేక చిత్రాలు చూశా, ఆయన పాటలు విన్నా. ఆయన లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. నా సామిరంగలో పాటలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు అన్ని వైపుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది.
డైరెక్టర్ విజయ్ బిన్నీ గురించి ?
విజయ్ బిన్నీ కొత్త దర్శకుడిలా అనిపించలేదు. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమా తీర్చిదిద్దారు. ఆయన నిర్ణయాలు చాలా త్వరగా తీసుకుంటారు. అలాగే ప్రతి విషయంపై చాలా క్లారిటీ ఉంటుంది.
నిర్మాతల గురించి ?
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ వండర్ ఫుల్ ప్రొడ్యూసర్స్. చాలా సపోర్ట్ చేశారు. చాలా గ్రాండ్ గా సినిమాను నిర్మించారు. సినిమా అంటే వారికి చాలా ప్యాషన్. ఈ చిత్రంతో వారికి పెద్ద విజయం వస్తుందనే నమ్మకం ఉంది
తెలుగు కల్చర్ ఎలా అనిపించింది ? భాష పరంగా ఎలా ప్రిపేర్ అయ్యారు ?
తెలుగు, కన్నడ కల్చర్స్ సిమిలర్ గానే వుంటాయి. తెలుగు భాష మాత్రం నాకు కొత్త. రైటర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేశారు. వాయిస్ నోట్స్ ని బాగా ప్రాక్టీస్ చేశాను. ఈ ప్రక్రియ చాలా ఎంజాయ్ చేశాను.
మిమ్మల్ని చాలా మంది జూనియర్ అనుష్క పిలుస్తారు కదా.. ఎలా అనిపిస్తుంటుంది ?
అనుష్క అంటే నాకు చాలా ఇష్టం. అద్భుతమైన చిత్రాలు, పాత్రలు చేశారు. ఆమెతో పోల్చడం ఆనందమే (నవ్వుతూ)
మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ?
గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే చిత్రాలు చేయడానికి ఇష్టపడతాను. అలాగే పిరియాడిక్ ఫిల్మ్ చేయాలనే డ్రీమ్ వుంది. ఏదో ఒక రోజు రాజమౌళి సినిమాలో భాగం కావాలని బలంగా కోరుకుంటున్నాను(నవ్వుతూ)
కొత్త సినిమాలు గురించి ?
తమిళ్ లో హీరో సిద్ధార్ తో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే కన్నడలో ఓ రెండు ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!