ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్ మైసూర్ డాన్ గా కనిపించనున్నాడా? అంటే KGF 2 సినిమా చూసిన వాళ్లకి అవుననే అనిపించకమానదు. గత కొంతకాలంగా KGF, సలార్ సినిమాలకి మధ్య కనెక్షన్ ఉందనే మాట వినిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగానే ప్రశాంత్ నీల్ తన యూనివర్స్ ని ప్లాన్ చేసి రాకీ భాయ్-సలార్ లని కలిపే ప్రయత్నం చేస్తే KGF 2లో ఎక్కడో ఒక చోట హింట్ ఇచ్చి ఉండాలి. ఆ హింట్ కోసం KGF 2 సినిమాని ఒకసారి చూస్తే ఒక హై ఇంటెన్సిటీ సీన్ లో చిన్న క్లూ ఇచ్చినట్లు తెలుస్తోంది. KGF 2 సినిమాలో గోల్డ్ స్టోరేజెస్ లో రైడ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఒక రౌడీ వచ్చి రాకీ భాయ్ తో బెంగుళూరులో రైడ్ జరిగింది. మనకి ముందే ఇన్ఫర్మేషన్ వచ్చి, బంగారాన్ని అంతా మైసూర్ కి మార్చాము అని చెప్తాడు. ఈ సీన్ తర్వాత రాకీ భాయ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి “పెద్దమ్మ” గన్నుని పేల్చే సీన్ వస్తుంది. ఆ ఇంటెన్స్ సీన్ రావడంతో మైసూర్ కి గోల్డ్ దాచిన విషయాన్నీ ఆడియన్స్ మర్చిపోయారు.
ఒక చిన్న గోల్డ్ బిస్కెట్ కోసం ఒక స్టేషన్ నే పేల్చినంత పని చేసిన రాకీ భాయ్, తన గోల్డ్ మాల్ ని మైసూర్ కి ఎవరిని నమ్మి పంపించాడు? అక్కడ ఎవరు ఉన్నారు? అనే ప్రశ్న మొదలవుతుంది. ఒకవేళ ఈ పాయింట్ తో సలార్ సినిమాకి KGF ఫ్రాంచైజ్ కి ప్రశాంత్ నీల్ లింక్ చేస్తే థియేటర్స్ లో సునామీ రావడం గ్యారెంటీ. రాకీ భాయ్-సలార్ లు కలుస్తారా లేదా అనేది తెలియాలి అంటే సెప్టెంబర్ 28 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. ఈ లోపు అసలు సలార్ ఏ రేంజులో ఉండబోతుంది అనేది తెలుసుకోవాలి అంటే జులై 7 వరకు వెయిట్ చెయ్యాల్సిందే ఎందుకంటే మోస్ట్ అవైటెడ్ సలార్ టీజర్ రిలీజ్ అయ్యేది ఆరోజే.
