NTV Telugu Site icon

Arya: ఈ సినిమా గొడవలకి కారణం అయ్యేటట్లు ఉందే…

Arya

Arya

కోలీవుడ్ హీరో ఆర్య కెరీర్ అయిపొయింది అనుకున్న టైమ్ లో ‘సార్పట్ట పరంబర్తె’ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. పా రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆర్య కెరీర్ కి ఊపిరి పోసింది. సూపర్ హిట్ కొట్టిన జోష్ లో ఆర్య మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యాడు. అలా ఆర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖాదర్ భాషా ఎండ్ర ముత్తు రామలింగం’. ముత్తయ్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ 2న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసిన మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఒక విలేజ్, హిందూ-ముస్లిమ్ కమ్యూనిటీ మధ్య గొడవలు, ఈ గొడవల్లో ఇరుక్కున్న ఒక అమ్మాయి, ఈ టైంలో జైలు నుంచి బయటకి వచ్చిన హీరో… ఇదే ‘ఖాదర్ భాషా ఎండ్ర ముత్తు రామలింగం’ కథ. ట్రైలర్ చూస్తే ‘ఖాదర్ భాషా ఎండ్ర ముత్తు రామలింగం’ సినిమాలోని డైలాగ్స్ కాంట్రవర్సీ అయ్యేలా ఉన్నాయి.

ప్రభు ముస్లిమ్ గెటప్ లో “దేశంలో చట్టాలు మనకి న్యాయం చెయ్యలేవు, ఇక మన చట్టాలని నమ్ముకోవడమే మంచిది” అని అర్ధం వచ్చేలా చెప్పిన డైలాగ్ వివాదాస్పదం అయ్యేలా ఉంది. ఎండ్ లో ఆర్య “ఇప్పుడు విష్ణువు-శివుడు ఒకటే అనే మాట కాదు కావాల్సింది… అల్లా-మన అయ్యగారు ఒకటే అనే మాట కావాలి” అని చెప్పిన డైలాగ్ సినిమా కథలోని మెయిన్ పాయింట్ లా కనిపిస్తోంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది, ఆర్య ఫైట్స్ బాగా కట్ చేసారు. సిద్ధి ఇద్నానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడు. ట్రైలర్ లో కూడా జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. మరి ఎలాంటి గొడవలకి కారణం అవ్వకుండా ‘ఖాదర్ భాషా ఎండ్ర ముత్తు రామలింగం’ సినిమా ఆర్యకి మంచి హిట్ అవుతుందా లేక కాంట్రవర్సీ అవుతుందా అనేది చూడాలి.

Kathar Basha Endra Muthuramalingam Trailer | Arya | Muthaiya | Drumstick Productions | Zee Studios

Show comments