Site icon NTV Telugu

Web series: ‘అండర్ వరల్డ్ బిలియనీర్స్’లో అరవింద్ కృష్ణ!

Aravind

Aravind

Arvind Krishna: తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగానే కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నాడు అరవింద్ కృష్ణ. అతను ప్రధాన పాత్రలో రూపొందుతున్న వెబ్ సిరీస్ ‘అండర్ వరల్డ్ బిలియనీర్స్’. గగన్ గోపాల్ ముల్క దర్శకత్వం వహిస్తున్న ఈ సీరీస్ ను ఎల్.ఎస్. ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎల్. శ్రీనివాసులు, దీవి వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన దీని ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. స్టైలిష్ లుక్ లో అరవింద్ కృష్ణ కనిపిస్తున్న ఈ పోస్టర్ సిరీస్ పై అంచనాలు పెంచుతుంది. రాధిక ప్రీతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సీరీస్ లో మధుసూదన్, జ్యోతి రాయ్, షవర్ అలీ, అలోక్ జైన్, లీనా కపూర్, రవి మల్లిడి  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సీరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Exit mobile version