Site icon NTV Telugu

Vishwak Sen: మరోసారి పొగరు చూపించిన విశ్వక్.. సినిమా నుంచి అవుట్

Vishwak

Vishwak

Vishwak Sen: మాస్ కా దాస్ అంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశ్వక్ సేన్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో కోపం గురించి అందరికి తెల్సిందే. ఎన్నోసార్లు విశ్వక్ కొద్దిగా పొగరు చూపించాడని, అతనికి బలుపు ఉన్నాడని ఇండస్ట్రీలో వారే నిర్మొహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక వివాదాలలో ఇరుక్కోవడం అనేది విశ్వక్ కు సర్వ సాధారణంగా మారిపోయింది. మొన్నటికి మొన్న ప్రాంక్ చేసి నెటిజన్స్ కు కోపం తెప్పించాడు.. ఆ తరువాత యాంకర్ ను బూతులు తిట్టి కోర్టు వరకు వెళ్ళాడు. ప్రస్తుతం అవన్నీ సద్దుమణిగాయి అనేలోపు కుర్ర హీరో మరో వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా విశ్వక్ మీద ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు వచ్చినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. నటుడు, డైరెక్టర్ అయిన అర్జున్ సర్జా దర్శకత్వంలో విశ్వక్ ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవ్వడంతో అప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాలో విశ్వక్ సరసన అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కు కాల్షీట్స్ ఇచ్చి ఒక్కరోజు కూడా షూటింగ్ కు రాలేదట. అయితే సడెన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ విశ్వక్ షూటింగ్ కు రానని చెప్పేశాడట.. ఎంతమంది ఫోన్ చేసినా ఫోన్లు తీయడం లేదట. దీంతో అర్జున్, విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఈ వివాదంపై స్పందించారు. ” షూటింగ్ కు రమ్మని విశ్వక్ ను ఎన్నోసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. షెడ్యూల్ మార్చమని చెప్తున్నాడు. మొత్తం షెడ్యూల్ ఎలా మారుస్తారు. విశ్వక్ సేన్ ప్రవర్తన మా టీమ్ కు ఎంతో ఇబ్బందికి గురిచేసింది. దీని గురించి అతడితో ఎన్నిసార్లు మాట్లాడాలని పిలిచినా అతను స్పందించలేదు.” అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version