Arjun Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బాంద్రాలో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఒక ఇల్లును తక్కువ ధరకే ఈ హీరో అమ్మేయడం బాలీవుడ్ లో చర్చకు దారితీసింది. అర్జున్ కపూర్, హాట్ బ్యూటీ మలైకా అరోరా గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం విదితమే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బాంద్రాలో మలైకా నివాసం ఉంటుండగా.. ప్రియురాలికి దగ్గరగా ఉండొచ్చు అన్న భావనతో అర్జున్ కపూర్ గతేడాది దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు పెట్టి అక్కడే ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు.
కేసీ మార్క్ లోని ఒక భవనంలో 19 వ అంతస్తు లో ఉన్న విలాసవంతమైన ఫ్లాట్ ఎంతో అందంగా ఉంటోంది. అప్పటినుంచి ఈ ఇంట్లోనే ఉంటున్న అర్జున్ అనుకోని విధంగా ఈ ఫ్లాట్ ను అమ్మేశాడని బాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. అందులోనూ తాను కొన్నదానికి తక్కువగానే ఫ్లాట్ ను అమ్మేశాడట. రూ. 4 కోట్ల నష్టంతో రూ. 16 కోట్లకు ఫ్లాట్ ను అమ్మేశాడని టాక్. అయితే సడెన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి..? మలైకా, అర్జున్ ల మధ్య విభేదాలు ఏమైనా తలెత్తాయా..? అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అర్జున్ కపూర్.. ఏక్ విలన్ రిటర్న్స్ విలన్ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ ఇంటి విషయమై అర్జున్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
