NTV Telugu Site icon

Arjun Kapoor: ప్రెగ్నెంట్ అయిన మలైకా.. ఆ ధైర్యం చేయకు అంటూ అర్జున్ వార్నింగ్

Arjun

Arjun

Arjun Kapoor: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. సహజీవనం చేస్తున్నా ఈ జంట మాత్రం పెళ్లి గురించి నోరు మెదపడం లేదు. ఈ ఏడాది, వచ్చే ఏడాది అంటూ అభిమానులే సర్దుకొంటూ పోతున్నారు. ఇక మలైకా గురించి కానీ, తమ రిలేషన్ గురించి ఎవరు కొంచెం అతిగా రాసినా అర్జున్ వారికి ఘాటుగానే స్పందిస్తాడు. ఇక తాజాగా మలైకా ప్రెగ్నెంట్ అయ్యిందరు బీ టౌన్ కోడై కూస్తోంది.

ఒక వెబ్ సైట్ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ రాసుకొచ్చేసింది కూడా.. దీంతో ఈ వార్తపై అర్జున్ కపూర్ ఘాటుగానే స్పందించాడు. సోషల్ మీడియాలో ఆ ఆర్టికల్ ను షేర్ చేస్తూ మండిపడ్డాడు. మీరు క్యాజువల్ గా తీసుకొని రాసే న్యూస్ మాకు ఎంత సెన్సిటివ్ గా అనిపిస్తుందో తెలుసా.. ఇలాంటి చెత్త న్యూస్ లు ఎలా రాస్తున్నారు. ఇదే కాదు చాలా వార్తలు ఈ జర్నలిస్ట్ ఇలాగే రాసింది. ఇలాంటి ఫేక్ న్యూస్ లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి నిజాన్ని నొక్కేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. మా పర్సనల్ జీవితంలోకి తొంగి చూడడానికి దైర్యం చేయకండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త బీ టౌన్ లో వైరల్ గా మారింది.