బాలీవుడ్ క్యూట్ ఫ్యామిలీస్ లో బోనీ కపూర్ ఫ్యామిలీ ఒకటి.. బోనీ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ బయట ఎలా ఉన్నా చెల్లెళ్లతో మాత్రం ఎప్పుడు సరదాగానే ఉంటాడు. శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లతో సమయం చిక్కినప్పుడల్లా అల్లరి చేస్తూ కనిపిస్తాడు. ఇక నిన్న పెద్ద చెల్లెలు జాన్వీ పుట్టినరోజు కావడంతో .. ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేస్తూ ఆమెకు స్పెషల్ గా విషెస్ తెలిపాడు.
” నేను నీ జీవితంలో జరిగిన చాలా పుట్టినరోజులకు లేనని తెలుసు .. కానీ ఇప్పుడు నువ్వు నా జీవితంలో అతుక్కుపోయావు” అంటూ చెల్లెలిపై ప్రేమను కురిపించాడు. అయితే క్యాప్షన్ బావుంది కానీ ఆ ఫోటో ఏంటి జాన్వీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫొటోలో బోల్డ్ అవతారంలో జాన్వీ కనిపిస్తుండగా.. ఆమె ఏంటో అన్నట్లుగా అర్జున్ సైగలు చేస్తూ కనిపించాడు. దీంతో అన్న ముందు ఏంటీ అవతారం జాన్వీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
