Site icon NTV Telugu

Panchathantram Song : విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన మెలోడీ

Panchatantram

Panchatantram

హర్ష పులిపాక దర్శకత్వం వహించిన తాజా చిత్రం “పంచతంత్రం”లో నుంచి తాజాగా మెలోడీ సాంగ్ ను విడుదల చేశారు. నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, దివ్య దృష్టి, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సినిమా నుండి సెకండ్ ట్రాక్ “అరెరే అరెరే”ని విడుదల చేసారు. ప్రశాంత్ ఆర్ విహారి కంపోజ్ చేసిన ఈ మెలోడీని చిన్మయి, ఎస్పీ చరణ్ పాడారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం చాలా బాగుంది.

Read Also : Beast : విజయ్ ప్రచారానికి వస్తాడా!? 

“పంచతంత్రం”లో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ ఒరిజినల్స్, టికెట్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని రానున్న రోజుల్లో నిర్మాత ప్రకటించనున్నారు.

Exit mobile version