Site icon NTV Telugu

A.R. Rahman: ఇండియాలో అత్యధిక ఆస్కార్’లు పొందింది ఎవరో తెలుసా?

Ar Rahman Controversy

Ar Rahman Controversy

ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా ‘ఆస్కార్’ (అకాడమీ అవార్డ్స్) ను పరిగణిస్తారు, దశాబ్దాల భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో ఇప్పటివరకు 10 మంది భారతీయులు ఈ గోల్డెన్ విగ్రహాన్ని ముద్దాడారు. ఇందులో సాధారణ సినిమా విభాగాలతో పాటు టెక్నికల్ మరియు సైంటిఫిక్ విభాగాలు కూడా ఉండటం విశేషం. అయితే భారతీయ సినీ చరిత్రలో అత్యధిక ఆస్కార్ పురస్కారాలు అందుకున్న వ్యక్తిగా ఏఆర్ రెహమాన్ అగ్రస్థానంలో నిలిచారు. 2009లో జరిగిన 81వ అకాడమీ అవార్డుల వేడుక భారతీయ సంగీత ప్రియులకు ఒక మధుర జ్ఞాపకం. ఆ ఒక్క రాత్రిలోనే రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు.

Also Read : Priyanka Chopra : 1300 గంటలు కష్టపడి చేసిన నెక్లెస్.. ప్రియాంక మెడలో ఎలా ఉందో చూశారా?

హాలీవుడ్ చిత్రం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ లోని అద్భుతమైన సంగీతానికి గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఆ చిత్రానికి సంబంధించి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో మొదటి అవార్డు. అందరినీ ఉర్రూతలూగించిన ‘జై హో’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో రెండో అవార్డు దక్కాయి.
ఒకే ఏడాది రెండు ఆస్కార్‌లు గెలుచుకుని, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ప్రతిభను చాటిచెప్పిన రెహమాన్, నేటికీ ఎంతోమంది యువ కళాకారులకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు.

Exit mobile version