టాలీవుడ్‌లోనూ ‘స్టాలిన్’, ‘స్పైడర్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తమిళ సినీ పరిశ్రమలో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఏఆర్ మురుగదాస్, ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం ఒక సరికొత్త కథాంశాన్ని ఎంచుకున్నట్టు వెల్లడించారు. ఇటీవల శివకార్తికేయన్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘మదరాసీ’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read :RK Roja : బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో ‘ఫైర్ బ్రాండ్’ గ్రాండ్ రీ-ఎంట్రీ!
తాజాగా తమిళ మీడియా హౌస్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మురుగదాస్ తన నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో ఒక కోతి (Monkey) ప్రధాన పాత్రలో నటించబోతోందని ఆయన తెలిపారు. వాస్తవానికి ఈ ఆలోచన ఆయనకు ఇప్పుడొచ్చింది కాదని ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కాలంలోనే ఈ కథను రాసుకున్నానని వెల్లడించారు.
Also Read : Anil Ravipudi: రావిపూడీ.. మరో మెట్టెక్కేసావ్.. ఇదెక్కడి మాస్ ప్రమోషన్ మామ
నిజానికి తన మొదటి సినిమాగా దీన్నే తెరకెక్కించాలని అనుకున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సినిమా పూర్తిస్థాయి గ్రాఫిక్స్/సిజిఐ (CGI) హంగులతో రూపొందనుంది. ముఖ్యంగా చిన్నారులను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ అడ్వెంచరస్ మూవీని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ‘దీనా’, ‘గజిని’, ‘తుపాకీ’ వంటి మాస్ యాక్షన్ సినిమాలతో మెప్పించిన మురుగదాస్, ఇప్పుడు రూట్ మార్చి యానిమేషన్, గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే సినిమా చేయబోతుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన మొదటి సినిమా కలని, ఇన్నాళ్లకు నెరవేర్చుకోబోతున్న ఈ టాప్ డైరెక్టర్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.
