Appanna and Ram Nandan roles in game changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్ సీక్వెన్స్ ని శంకర్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ ఉండగా ఈ సినిమా గురించిన ఒక కీలక వార్త బయటకి వచ్చి వైరల్ అవుతోంది. నిజానికి రామ్ చరణ్ సినిమాలో ఓ సారి గమనిస్తే మగధీరలో కాల భైరవ, రంగస్థలంలో చిట్టి బాబు, ట్రిపుల్ ఆర్‌లోని రామరాజు క్యారెక్టర్ల పేర్లను అంత ఈజీగా మరిచిపోలేం. ఈ క్యారెక్టర్స్ రామ్ చరణ్ క్రేజ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. నెక్స్ట్ గేమ్ చేంజర్ సినిమాతోను అదే ఇంపాక్ట్ చూపించబోతున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి కొడుకుగా విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు చరణ్.
Allu Arjun:’ప్రభాస్’ దెబ్బకు అలెర్ట్ అయిన ‘బన్నీ’..రిజెక్ట్ చేసేసినట్టే?
తండ్రి పాత్ర పవర్ ఫుల్ లీడర్ కాగా.. కొడుకు పాత్ర ఐఏఎస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. అయితే.. ఈ రెండు క్యారెక్టర్ల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తండ్రి పేరు అప్పన్న అని, కొడుకు పేరు రామ్ నందన్ కుమార్ అని తెలుస్తోంది. సమాజంలో మార్పు కోసం పరితపించే నాయకుడి తరహాలో అప్పన్న క్యారెక్టర్‌ని రిప్రజెంట్ చేస్తుండగా, ఈ జనరేషన్ కుర్రాడిగా, ఐఏఎస్ ఆఫీసర్‌గా రామ్ నందన్ క్యారెక్టర్ ఉంటుందని అంటున్నారు. దీంతో అప్పన్నగా, రామ్ నందన్‌గా చరణ్ అదరగొట్టడం ఖాయమంటున్నారు ఫాన్స్. ఇక పవన్ కుమారుడు అకీరా నందన్ కాగా రామ్ చరణ్ లోని చరణ్ తీసేసి రామ్ నందన్ గా ఫిక్స్ చేశారని అంటున్నారు. ఇక ఈ పేర్లు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయని అంటున్నారు. ఇక కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా 2024 సమ్మర్లో గేమ్ చేంజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.