Apoorva Srinivasan Married his Lover Silently: ఈ మధ్యకాలంలో హీరోలు, హీరోయిన్లు – టెక్నీషియన్లు అని తేడా లేకుండా దాదాపు అందరూ పెళ్లి బాటలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు సినీ నటి ఒకరు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు అపూర్వ శ్రీనివాసన్. ఆమె పేరుతో పిలిస్తే పెద్దగా గుర్తించలేకపోవచ్చు గాని టెంపర్ లో రేప్ కి గురైన అమ్మాయి అనగానే దాదాపు అందరికీ గుర్తుచేస్తుంది. టెంపర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాలో కూడా రేప్ కి గురైన అమ్మాయి పాత్రలోనే నటించి అప్పట్లో ఈ భామ హాట్ టాపిక్ అయింది.
Salman Khan: కాల్పుల అనంతరం మొదటిసారి బయటకొచ్చిన సల్మాన్ ఖాన్
ఆ తర్వాత కూడా జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమ కథ చిత్రం 2 లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించింది. నిజానికి ఆమె ఒక ప్రొఫెషనల్ పైలెట్. నటిగా చివరిగా 2022 సంవత్సరంలో నీతో అనే సినిమా చేసి ప్రస్తుతానికి పైలట్ గానే కొనసాగుతోంది. అయితే ఆమె తన ప్రియుడుతో రహస్యంగా ఏడు అడుగులు వేసి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈమె పెళ్ళికి ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా హాజరైంది. ఆమె ఇంకెవరో కాదు సిమ్రాన్ చౌద.రి అపూర్వ శ్రీనివాసన్ శ్రేయస్ శివ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహిత స్నేహితులు మాత్రమే ఈ వేడుకలకు హాజరైనట్లుగా వెల్లడించారు.