NTV Telugu Site icon

RGV : వర్మకి ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్

Rgv Case

Rgv Case

గత కొద్ది రోజులుగా రాంగోపాల్ వర్మ కొన్ని కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతంలో వ్యూహం సినిమా రిలీజ్ చేసిన సమయంలో ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నారా లోకేష్ ల ఫోటోల మార్ఫింగ్ ట్వీట్లను ఉద్దేశిస్తూ ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల కేసు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులైతే వర్మను అరెస్ట్ చేసేందుకు కూడా హైదరాబాద్ వచ్చారు. ఇక ఈ నేపథ్యంలో వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు వర్మకి గుడ్ న్యూస్ చెప్పింది. వర్మ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

Also Read: Pushpa2TheRule : ఓవర్సీస్ లేటెస్ట్ కలెక్షన్స్.. జెట్ స్పీడ్

అలాగే రాంగోపాల్ వర్మ వేసిన క్వాష్ పిటిషన్ వివరాలను కూడా అందించాలని కోరింది. ఇక తన మీద నమోదైన కేసులు చెల్లవని అంటున్నారు రాంగోపాల్ వర్మ. ఎప్పుడో ఏడాది క్రితం వేసిన ట్వీట్లు తనకు గుర్తే లేవని, మనోభావాలు దెబ్బతిని ఉంటే అప్పుడే కేసులు వేసి ఉండాల్సింది అని ఇప్పుడు కేసులు వేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఈ విషయంలో లీగల్ గానే పోరాడుతానని ఆయన అంటున్నారు. అలాగే మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు తాను ఎక్కడికీ పరారు అవ్వలేదని హైదరాబాదులోని తన ఆఫీసు అయిన డెన్ లోనే ఉన్నానని చెబుతున్నారు. నిజానికి కొద్ది రోజుల క్రితం డెన్ ఉన్న ప్రాంతానికి ఏపీ పోలీసులు వచ్చారు. అయితే ఆ రోజు వర్మ లేరని చెప్పి పంపించారు అక్కడి సిబ్బంది.