Site icon NTV Telugu

Hit-3 : ఏపీలో హిట్-3 టికెట్ల రేట్లు పెంచుతూ జీవో

Hit3 Teaser

Hit3 Teaser

Hit-3 : నేచురల్ స్టార్ నాని నటించిన హిట్-3 మే1 న రిలీజ్ కాబోతోంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న మూడో సినిమా. ఇప్పటికే వచ్చిన రెండు పార్టులు మంచి హిట్ అయ్యాయి. అందుకే మూడో పార్టు మీద అంచనాలు పెరుగుతున్నాయి. పైగా ఎన్నడూ లేనంతగా ఇందులో వైలెంటిక్ పాత్రలో నటిస్తున్నాడు నాని. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ అంచనాలను పెంచేశాయి. దీంతో మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ టికెట్ల రేట్లు పెంచిన తర్వాతనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం మూవీ టీమ్ కు గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రేట్లను పెంచుతూ జీవో విడుదల చేసింది.
Read Also : Samantha : సమంతకు అండగా బడా నిర్మాణ సంస్థలు..

సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ లలో రూ.75 వరకు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. జీఎస్టీతో కలిపి ఈ ధరలను పెంచింది. మూవీ విడుదలైన తేదీ నుంచి వారం వరకు ఈ ధరలు ఉంటాయి. ఆ తర్వాత మామూలు ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవానికి జీవో నిన్ననే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో ఆలస్యం అయింది. ఇప్పుడు జీవో రావడంతో మూవీ అడ్వాన్స్ బుక్ మై షోలో ఓపెన్ అయ్యాయి. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో దీన్ని తెరకెక్కించారు. ఇటు తెలంగాణలో మాత్రం టికెట్ల రేట్లు పెంచట్లేదు.
Read Also : BHOGI : శర్వానంద్ ‘భోగీ’ ఫస్ట్ స్పార్క్ రిలీజ్..

Exit mobile version