NTV Telugu Site icon

Anushka: స్వీటీకి ఆ జబ్బు ఉందంట.. 20 నిముషాలు బ్రేక్ కూడా లేకుండా

Anushka

Anushka

Anushka: టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దం సినిమా తరువాత స్వీటీ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే.. ఇక ఈ మధ్యనే యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ షూటింగ్ అనుష్క బిజీగా ఉంది. ఆమె రాక కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే స్వీటీకి ఒక జబ్బు ఉందంట.. జబ్బు అనగానే అదేదో ఆరోగ్య సమస్య అని అనుకోకండి.. స్వీటీ నవ్వును ఆపుకోలేదట.. ఒక్కసారి నవ్వితే.. కంట్రోల్ చేసుకోవడం కష్టమట.. ఒక 15 నిమిషాల వరకు కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉంటుందట. అదేనండీ మన భాషలో చెప్పాలంటే పడిపడి నవ్వడం లా అన్నమాట. చుట్టూ తిరుగుతూ, కిందపడిపోయి అయినా నవ్వుతూనే ఉంటుందట. ఈ విషయాన్ని అనుష్కనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

SidKiara: పెళ్లికి ముందే కియారా ప్రెగ్నెంట్.. బాంబ్ పేల్చిన నటుడు

“నేను నవ్వడం స్టార్ట్ చేస్తే షూటింగ్ కొంచెం సేఫ్ ఆపేస్తారు. ఒక 15- 20 మినిట్స్ బ్రేక్ తీసుకొని అందరు టిఫిన్ చేసుకొని వస్తారు. కంటిన్యూగా ఆ నవ్వు అలా వస్తుంది.. అదొక జబ్బులా అన్నమాట. నేను నవ్వడం స్టార్ట్ చేస్తే 15- 20 మినిట్స్ పడి పడి నవ్వుతూ ఉంటాను. ఇక్కడి నుంచి అక్కడికి.. అక్కడి నుంచి అటు ఇటు తిరుగుతూ నవ్వుతుంటాను.. స్టాప్ బ్లాక్.. స్టాప్ బ్లాక్ లో షూట్ లో చేయొచ్చు అది” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు మరీ అంతగా ఎలా నవ్వుతావ్ స్వీటీ అని కొందరు.. నువ్వు ఎంత స్పీడు నవ్వినా అలా చూస్తుండిపోవచ్చు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments